Karnatka Elections 2023 : ఎన్నికల మేనిఫెస్టోలో సినిమా ఇండస్ట్రీకి పార్టీల హామీలు.. ఇవి చేస్తారట
Sandalwood : కర్ణాటకలో రాజకీయం గరంగరంగా ఉంది. రాజకీయ పార్టీల తరఫున సినిమా నటులూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో సినిమా ఇండస్ట్రీకి ప్రధాన పార్టీలు స్థానం కల్పించాయి. పలు హామీలు ఇచ్చాయి.
కర్ణాటకలో ఎన్నికలకు(Karnataka Elections) మరో వారం మాత్రమే సమయం ఉంది. మే 7న బహిరంగ ప్రచారం ముగియనుంది. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు జనాల్లో తిరుగుతున్నారు. దీంతో పాటు అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలను విడుదల చేశాయి. ఈ మేనిఫెస్టోలో చిత్ర పరిశ్రమకు కూడా కొన్ని పథకాలు హామీ ఇచ్చారు.
దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్(puneeth rajkumar) పేరిట హార్ట్ హెల్త్ స్కీమ్ కింద ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్లను కొనుగోలు చేసేందుకు ఆసుపత్రులకు సబ్సిడీ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ(Congress Party) తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఆటోమేటిక్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ పరికరం ఆకస్మికంగా గుండె ఆగిపోయిన వారికి సహాయం చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది హృదయ స్పందన రేటును విశ్లేషించే అధునాతన, ఉపయోగించడానికి సులభమైన వైద్య పరికరం. హృదయ స్పందనను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.
ఇది కాకుండా నటుడు డా.రాజ్‌కుమార్(Raj Kumar) పేరిట అన్ని వసతులతో కూడిన సినిమా సిటీ నిర్మిస్తారని చెప్పారు. రంగస్థలం, జానపద తదితర రంగాల వృత్తి కళాకారులకు గృహనిర్మాణ పథకం, యక్షగాన, సంగీత, నాటక కళాకారులకు ఆర్థిక సాయం, గుబ్బి వీరన్న థియేటర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
కన్నడ సినిమా కోసం సినిమా సిటీ(Cinema City).. చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఈసారి అధికారంలోకి వస్తే నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరు మీద మైసూర్‌లో దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ(Film City)ని నిర్మిస్తామని బీజేపీ(BJP) తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.
కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్(JDS) పార్టీలు తమ మేనిఫెస్టోలో సినీ పరిశ్రమకు కొన్ని హామీలు ఇచ్చాయి. కళాకారులకు ఇచ్చే పింఛను 2 వేల నుంచి 4 వేలకు పెంచుతామన్నారు. కళాకారులకు గృహనిర్మాణ పథకం కింద స్థలం కల్పిస్తామని పేర్కొన్నారు. ఇలా కర్ణాటకలో రాజకీయాలు సినిమా ఇండస్ట్రీ చుట్టు కూడా తిరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రముఖ నటులు కూడా ప్రచారంలో పాల్గొని రాజకీయ వేడి మరింత పెంచుతున్నారు. క్లైమాక్స్ కు ప్రచారం చేరుతుండటంతో పార్టీలు కూడా సినిమా నటులను ప్రచారానికి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రధాన పార్టీల తరఫున అగ్రనేతలు, స్టార్ క్యాంపెయినర్లు సుడిగాలి ప్రచారంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. నటుడు శివ రాజ్‌కుమార్ కూడా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మెరిశారు.
సంబంధిత కథనం