Jr NTR and Ram Charan Trolled: ఆర్ఆర్ఆర్.. ఓవైపు ప్రశంసలు.. మరోవైపు ట్రోలింగ్.. ఇదీ కారణం
Jr NTR and Ram Charan Fake Accent Trolled: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌కు ఓవైపు ప్రశంసలు.. అదే సమయంలో మరోవైపు ట్రోలింగ్ జరుగుతోంది. గోల్డెన్ గ్లోబ్స్ గెలిచి తెలుగు ప్రజలనే కాదు.. మొత్తం దేశాన్నీ గర్వంగా తలెత్తుకునేలా చేసినా.. ఓ చిన్న కారణం వల్ల తారక్, చరణ్‌లు ట్రోలింగ్‌కు గురవుతున్నారు.
Jr NTR and Ram Charan Fake Accent Trolled: ఊహించినట్లే మన ఆర్ఆర్‌ఆర్ మూవీ అంతర్జాతీయ వేదికపైనా తెలుగు వాళ్లంతా గర్వపడేలా చేసింది. ఈ సినిమా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంది. నాటు నాటు పాటకుగాను ఈ అవార్డు వచ్చింది. ఈ ఘనత సాధించిన మూవీ టీమ్‌పై దేశ ప్రధాని మోదీ సహా కోట్లాది మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
అయితే అదే సమయంలో ఆర్‌ఆర్‌ఆర్‌లో లీడ్ రోల్స్‌లో కనిపించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను కొందరు అభిమానులు ట్విటర్‌లో ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం అవార్డు సెర్మనీ సందర్భంగా ఈ ఇద్దరూ అక్కడి మీడియాతో మాట్లాడిన యాస. సాధారణంగా మన ఇండియన్స్ మాట్లాడే ఇంగ్లిష్ యాస ఒకలా ఉంటుంది. అమెరికన్స్, బ్రిటీషర్లది మరోలా ఉంటుంది.
అయితే ఈ ఇద్దరు హీరోలు మాత్రం గోల్డెన్‌గ్లోబ్స్ వేదికపై అడుగుపెట్టేసరికి తమ యాస మార్చేశారు. ఇండియన్ ఇంగ్లిష్ వదిలేసి అమెరికన్ల స్టైల్లో మాట్లాడారు. ఇదే అభిమానులకు నచ్చలేదు. అమెరికాలో అడుగుపెట్టినంత మాత్రాన ఇలా లేని యాసను తెచ్చి పెట్టుకోవడం ఎందుకని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. వాళ్లు మాట్లాడే తీరు చూస్తుంటే.. తమకు అలవాటు లేని యాసను తెచ్చి పెట్టుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని, దాని కంటే ఇండియన్ ఇంగ్లిష్‌లోనే మాట్లాడితే తప్పేంటన్నది ఫ్యాన్స్ వాదన.
ఇండియన్ ఇంగ్లిష్ కాదు.. అమెరికా, బ్రిటీష్ ఇంగ్లిషే కరెక్ట్ అనేలా వీళ్ల వైఖరి ఉన్నదని మరికొందరు విమర్శించారు. అక్కడి ఛానెల్స్ యాంకర్లు అడిగే ప్రశ్నలకు ఈ ఇద్దరు హీరోలు వాళ్ల యాసలోనే సమాధానం ఇచ్చే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌పై ఈ ట్రోలింగ్ కాస్త ఎక్కువగా ఉంది. ప్రతిష్టాత్మక అవార్డు గెలిచినందుకు ఓవైపు ప్రశంసిస్తూనే.. మరోవైపు ఇలా ఈ చిన్న కారణం వల్ల ఈ ఇద్దరు హీరోలను ట్రోల్ చేస్తున్నారు.
సంబంధిత కథనం