Janhvi Kapoor Remuneration : జాన్వీ కపూర్​కు ఓన్లీ తెలుగు ఆదాయమే 20 కోట్లు..!-janhvi kapoor remuneration janhvi kapoor income from telugu movies more than 20 crores ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Janhvi Kapoor Remuneration Janhvi Kapoor Income From Telugu Movies More Than 20 Crores

Janhvi Kapoor Remuneration : జాన్వీ కపూర్​కు ఓన్లీ తెలుగు ఆదాయమే 20 కోట్లు..!

Anand Sai HT Telugu
May 04, 2023 12:17 PM IST

Janhvi Kapoor Remuneration : అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతోంది. తెలుగులో ఎన్టీఆర్ సినిమాతో అరంగేట్రం చేస్తుంది. ఈ సినిమాకు భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో మరికొన్ని సినిమాలు కూడా చేసేందుకు సిద్ధమైంది.

జాన్వీ కపూర్
జాన్వీ కపూర్

శ్రీదేవి(Sri Devi) కూతురు.. జాన్వీ కపూర్ బాలీవుడ్ స్టార్ యువ నటి. గ్లామర్ పాత్రలతో పాటు ఛాలెంజింగ్ పాత్రల్లోనూ నటించేందుకు ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు సౌత్ సినిమాల్లో అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో తన మొదటి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్‌తో(NTR) కలిసి నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే జాన్వీ మరో తెలుగు సినిమా(Telugu Cinema) ఆఫర్‌ని అంగీకరించినట్లు సమాచారం. ఎన్టీఆర్ తో సినిమాకు రూ.4 కోట్ల వరకూ అందుకుంటోంది.

ధడక్ సినిమాతో 2018లో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ(Janhvi). ఈ హాట్ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారింది. అయితే తెలుగులోనూ తన ప్రతిభ చూపించేందుకు రెడీ అయింది. ఎన్టీఆర్ 30(NTR 30) సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తోంది. నాలుగు కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటోదని టాక్ ఉంది. ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు.. అయినా జాన్వీకి వరుసగా ఆపర్లు క్యూ కడుతున్నాయి.

మరికొంతమంది స్టార్ హీరోల సరసన నటించేందుకు సిద్ధమైంది జాన్వీ. మెగా పవర్ స్టార్ రాంచరణ్(Ramcharan)తో కలిసి నటించేందుకు రెడీ అయింది. అంతేకాదు.. అక్కినేని అఖిల్(Akkineni Akhil) సరసన కూడా నటించేందుకు సైన్ చేసినట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. టాలీవుడ్ టాప్ హీరోల(Tollywood Top Heros) సరసన ఛాన్సులు కొట్టేసిందీ ముద్దుగుమ్మ.

ఈ ముగ్గురితోనే కాకుండా.. మరో రెండు ప్రాజెక్టులపై చర్చలు జరుగుతున్నాయట. వాటికి కూడా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ లో అడుగు పెట్టిందో .. లేదో.. జాన్వీకి వరుసు ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె పారితోషికం విషయంలో మాత్రం తగ్గడం లేదు. కోట్లలో డిమాండ్ చేస్తోంది. ఎన్టీఆర్ సినిమాకు 4 కోట్ల వరకూ తీసుకుంటుందని చర్చ జరిగింది. ఇప్పుడు మిగిలిన సినిమాల్లోనూ అంతే తీసుకుంటే.. జాన్వీకి తెలుగు నుంచే రెమ్యూనరేషన్ 20 కోట్ల వరకు వెళ్తుంది.

ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి రెండేళ్లపైనే పడుతుంది. దీంతో తెలుగు నుంచే 20 కోట్ల వరకూ అందుకుంటుందని టాక్ ఉంది. ఈ సినిమాలు పూర్తయ్యే సరికి జాన్వీకి మరిన్ని అవకాశాలు వస్తాయి. సౌత్ సినిమాలపై.. జాన్వీ ఫోకస్ ఎక్కువగానే పెట్టనుంది. తన తల్లి శ్రీదేవిలాగా మంచి గుర్తింపు తెచ్చుకునే పనిలో పడుతోంది జాన్వీ.

IPL_Entry_Point

సంబంధిత కథనం