Gandeevadhari Arjuna vs Bedurulanka: గాండీవధారి అర్జున వర్సెస్ బెదురులంక - తొలిరోజు వరుణ్‌తేజ్‌పై కార్తికేయదే పైచేయి
Gandeevadhari Arjuna vs Bedurulanka: శుక్రవారం రిలీజైన వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున, కార్తికేయ బెదురులంక 2012 మూవీస్ మోస్తారు కలెక్షన్స్ రాబట్టాయి. ఫస్ట్ డే వరుణ్‌తేజ్‌తో పోలిస్తే కార్తికేయదే సినిమానే డీసెంట్ కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం.
Gandeevadhari Arjuna vs Bedurulanka: వరుణ్‌తేజ్ హీరోగా నటించిన గాండీవధారి అర్జునతో పాటు కార్తికేయ బెదురులంక 2012 మూవీస్ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో గాండీవధారి అర్జునకు నెగెటివ్ టాక్ రాగా బెదురులంక 2012 మూవీ మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నది. ఈ రెండు సినిమాల్లో ఫస్ట్ డే కార్తికేయ మూవీ డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టగా వరుణ్‌తేజ్‌కు మాత్రం నిరాశే మిగిలింది. వరుణ్‌తేజ్ కెరీర్‌లో అతి తక్కువ ఓపెనింగ్స్‌ను దక్కించుకున్న సినిమాగా గాండీవధారి అర్జున నిలిచింది.
బెదురులంక కలెక్షన్స్
బెదురులంక మూవీ ఫస్ట్ డే కోటి నలభై లక్షల కలెక్షన్స్ రాబట్టింది. నైజాం ఏరియాలో అత్యధికంగా 43 లక్షల వరకు కలెక్షన్స్ రాగా, సీడెడ్‌లో 24 లక్షలు, ఉత్తరాంధ్రాలో 22 లక్షల వరకు ఈ మూవీ కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.
ఓవరాల్‌గా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు కోటి నలభై లక్షల గ్రాస్, 80 లక్షలకుపైగా షేర్ బెదురులంక మూవీకి వచ్చింది. ఆర్ఎక్స్ 100, చావు కబురు చల్లగా తర్వాత కార్తికేయ కెరీర్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా బెదురులంక 2012 మూవీ నిలిచింది. ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించగా నేహాశెట్టి హీరోయిన్‌గా నటించింది.
గాండీవధారి అర్జునకు షాకింగ్ కలెక్షన్స్
మెగా హీరో వరుణ్‌తేజ్ గాండీవధారి అర్జునకు ఫస్ట్ డేనే బాక్సాఫీస్ వద్ద షాక్ తగిలింది. శుక్రవారం రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కోటి ముప్పై లక్షల గ్రాస్‌ను, 60 లక్షలకుపైగా షేర్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మార్నింగ్ షో నుంచే సినిమా బాగాలేదని మౌత్ టాక్ స్ప్రెడ్ కావడం ఓపెనింగ్స్‌ఫై ప్రభావం చూపినట్లు సమాచారం.
రెండో రోజు వసూళ్లు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గాండీవధారి అర్జున సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. మెడికల్ వేస్టేజీ బ్యాక్‌డ్రాప్‌లో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.