Evil Dead Rise Review: భయానికే మీనింగ్ తెలియని బ్లడ్డా మీది? ఈ మూవీ చూసి ఆ మాట చెప్పండి..!-evil dead rise movie reveiw in telugu big treat for horror fans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Evil Dead Rise Review: భయానికే మీనింగ్ తెలియని బ్లడ్డా మీది? ఈ మూవీ చూసి ఆ మాట చెప్పండి..!

Evil Dead Rise Review: భయానికే మీనింగ్ తెలియని బ్లడ్డా మీది? ఈ మూవీ చూసి ఆ మాట చెప్పండి..!

Maragani Govardhan HT Telugu
Apr 23, 2023 07:28 PM IST

Evil Dead Rise Review: 90వ దశకంలో జన్మించిన వారికి ఈవిల్ డెడ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా చూసి భయంతో రాత్రుళ్లు నిద్రపట్టని వారు ఆ తరంలో చాలా మందే ఉన్నారు. తాజాగా ఈ సిరీస్‌ నుంచి విడుదలైన ఐదో భాగం ఈవిల్ డెడ్ రైజ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ
ఈవిల్ డెడ్ రైజ్ రివ్యూ

Evil Dead Rise Review: హర్రర్ సినిమాలంటే ముందుగా గుర్తుకొచ్చేది ఈవిల్ డెడ్(Evil Dead) సినిమానే. దెయ్యాన్ని చూస్తే భయపడటం కాదు.. ఆ పేరు వింటేనే వణికిపోయే మూవీ ఇది. అందుకే ఈ ఫ్రాంఛైజీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. సామ్ రైమీ తెరకెక్కించిన ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటి వరకు నాలుగు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాయి. ఐదో భాగం ఈవిల్ డెడ్ రైజ్(Evil Dead RTise) ఈ శుక్రవారం ఏప్రిల్ 21న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 3,402 ప్రాంతాల్లో విడుదలైన ఈ మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఇప్పటికే రెండురోజుల్లోనే 10.2 మిలియన్ డాలర్లను(రూ.85 కోట్లు) కొల్లగొట్టింది.

yearly horoscope entry point

19 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ వసూళ్ల పరంగా దూసుకెల్తోంది. లీ క్రొనీన్ దర్శకత్వం వహించిన ఈవిల్ డెడ్ రైజ్‌లో లిల్లి సల్లీవన్, అలిసా సదర్లాండ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. మోర్గాన్ డేవీస్ గాబ్రియేల్ ఎకోల్స్, నెల్ ఫిషర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

కథ..

ఎల్లీ(అలీసా సదర్లాండ్) అనే మహిళ ఓ అపార్ట్మెంటులో తన ముగ్గురు పిల్లలతో కలిసి నివాసముంటుంది. ఒక రోజు ఎల్లీని చూసేందుకు ఆమె చెల్లెలు బెత్(లిల్లీ సల్లీవాన్) వస్తుంది. అదే రోజు ఎల్లీ పెద్ద కొడుకు తమ ఇంటి బేస్‌మెంటులో ఉన్న బాక్స్‌ను ఓపెన్ చేసి అందులో ఉన్న గ్రామఫోన్ రికార్డును ప్లే చేస్తాడు. తన చెల్లెలు ఎంత చెప్పినా వినకుండా వాటిని ప్లే చేస్తాడు. దీంతో వారి జీవితాలు ఒక్కసారిగా తలకిందులవుతాయి. ఎల్లీనే తమ బిడ్డలను చంపడానికి వస్తుంది. ఇలా ఎందుకు జరిగింది? ఆ గ్రామపోన్ రికార్డుల్లో ఏముంది? లాంటివి తెలియాలంటే ఈవిల్ డెడ్ రైజ్ మూవీని థియేటర్లలో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే.

ఈవిల్ డెడ్ రైజ్ ఎలా ఉందంటే..

ఈ సినిమాపై సర్వత్రా పాజిటివ్ టాక్ రావడంతో విపరీతంగా బజ్ ఏర్పడింది. ఆడియెన్స్‌ను సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెడుతూ ఆద్యంతం భయపెడుతుంది. హర్రర్ జోనర్ నచ్చేవారికి ఈవిల్ డెడ్ రైజ్ మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. ఇటీవల కాలంలో విడుదలైన హర్రర్ సినిమాల్లో ఇది బెస్ట్ చిత్రంగా చెప్పవచ్చు. దర్శకుడు లీ క్రొనీన్ హర్రర్ ప్రియులను ఆకర్షించేలా చక్కటి స్టోరీ లైన్‌తో ఒళ్లు గగుర్పొడిపించే సన్నివేశాలతో హర్రర్ యాంబియన్స్‌ను, అనుభూతిని కలిగించారు.

ఈవిల్ డెడ్ గత చిత్రాలకంటే కూడా ఇందులో వయలెన్స్ ఎక్కువగా ఉంటుంది. రక్తపాతాన్ని బాగా చూపించారు. క్లైమాక్స్‌కు ముందు సీన్ అయితే ప్రేక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. అంత రక్తపాతాన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆడియెన్స్ కాస్త ఇబ్బంది ఫీలవుతారు. కాస్త చికాకుగా ఉన్నప్పటికీ ఈ సన్నివేశాలను ఇష్టపడేవాళ్లకు బాగానే అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే..

ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన లిల్లీ సల్లీవన్, అలీసా సదర్లాండ్స్ తన రోల్స్‌లో ఒదిగిపోయారు. భయానక పరిస్థితులను ఎదుర్కొవడం, పోరాడటం అబ్బురపరిచేలా ఉంది. ఈవిల్ డెడ్ రైజ్‌లో ఉపయోగించిన విజువల్ ఎఫెక్ట్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. విజువల్స్‌తో పాటు ప్రాక్టికల్ ఎఫెక్ట్స్‌ను దర్శకుడు చక్కగా ఉపయోగించుకున్నారు. వీటి వల్ల సినిమా మొత్తం హర్రర్ ఫీల్‌ ఉంచేలా సక్సెస్ అయ్యారు. హర్రర్ సినిమాలను ఇష్టపడేవాళ్లు ఆ థ్రిల్లింగ్‌ను తప్పకుండా అనుభూతి చెందుతారు.

సాంకేతిక వర్గం దగ్గరకొస్తే సౌండ్ డిజైనింగ్.. సినిమా మూడ్‌కు తగినట్లుగా ఉంటుంది. కొన్ని చోట్లయితే విపరీతంగా భయాన్ని కలిగిస్తుంది. హర్రర్ ప్రియులకు.. ఎలాంటి సంగీతమైతే ఉంటే బాగుంటుందో అదే విధంగా స్టోరీకి తగినట్లుగా బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో భయపెట్టారు. సగం ఈ మూవీని ఎలివేట్ చేసేది ఈ మ్యూజిక్. హర్రర్ సినిమాలకు పర్ఫెక్టుగా సూటయ్యేలా ఉంది.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమంటే హాలీవుడ్‌లోనే కాకుండా మన దేశంలోనూ ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో అర్ధరాత్రి షోల్లోనూ క్రౌడ్ బాగా రావడం గమనార్హం. పాజిటివ్ టాక్ కారణంగా మూవీకి విశేష ఆదరణ లభిస్తోంది.

చివరగా.. భయపడాలంటే ఈ సినిమా చూడండి.. సెన్సిటివ్ పర్సన్స్ మాత్రం జాగ్రత్త

రేటింగ్: 3/5.

Whats_app_banner