Bigg Boss Elimination: మరోసారి బిగ్ బాస్ ముద్దుబిడ్డ ఎలిమినేట్.. ఫ్యామిలీ వీక్‌తో తొక్కిపడేసిన పెద్దయ్య
Bigg Boss 7 Telugu 10th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 10వ వారం ఎలిమినేషన్‌పై ఫ్యామిలీ వీక్ ఎఫెక్ట్ ఉండనుంది. మొన్నటివరకు సపోర్ట్ చేసిన తన ముద్దుబిడ్డను ఫ్యామిలీ వీక్‌తో ఒక్కసారిగా తొక్కిపడేశాడు. దీంతో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
Bigg Boss Telugu Family Week: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. పదోవారం నామినేషన్స్ తర్వాత మంగళవారం నుంచి ఈ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. ముందుగా డాక్టర్ రూపంలో శివాజీ పెద్ద కొడుకు బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. పెద్ద కొడుకు రాకతో శివాజీ చాలా ఎమోషనల్ అయ్యాడు. అనంతరం అర్జున్ అంబటి భార్య సురేఖ హౌజ్‌లోకి అడుగు పెట్టింది. బిగ్ బాస్ హౌజ్‌లోనే ఆమెకు సీమంతం చేశారు. ఈ ఎపిసోడ్ చాలా ఎమోషనల్‌గా సాగింది.
ఎవరెవరు వచ్చారంటే?
తర్వాత రోజు అశ్విని తల్లి హౌజ్ లోకి అడుగు పెట్టారు. తల్లీకూతుళ్లు ఇద్దరూ చాలా ఏడ్చారు. గౌతమ్ కృష్ణ తల్లి ఎంట్రీ ఇవ్వగా.. హౌజ్ మేట్స్ అంతా కన్నీటిపర్యంతం అయ్యారు. గౌతమ్ కృష్ణ తల్లి రాకతో ప్రిన్స్ యావర్ చాలా ఏడ్చాడు. దాంతో తనను కూడా తన అమ్మ అనుకోమని గౌతమ్ మదర్ చెప్పారు. ఈ ఎపిసోడ్ కూడా మనసుకు చాలా హత్తుకుంది. తర్వాత సింగర్ భోలే భార్య వచ్చారు. అలాగే ప్రియాంక లవర్ శివ కుమార్ హౌజ్ లోకి అడుగు పెట్టాడు.
నామినేషన్లలో ఐదుగురు
ఇక మరో ఎపిసోడ్‌లో అమర్ దీప్ భార్య తేజస్విని వచ్చింది. నవంబర్ 9వ తేది ఎపిసోడ్‌లో శోభా శెట్టి తల్లి, ప్రిన్స్ యావర్ బ్రదర్ అడుగు పెట్టారు. ప్రిన్స్ సోదరుడి ఎంట్రీ మాత్రం చాలా ఎమోషనల్‌గా సాగింది. ఇక నేటి ఎపిసోడ్‌లో రతిక తండ్రి, రైతుబిడ్డ ప్రశాంత్ ఫాదర్ రానున్నారు. అయితే, పదో వారం నామినేషన్లలో శివాజీ, అమర్, గౌతమ్, రతిక, సింగర్ భోలే ఐదుగురు ఉన్నారు. ఈ నామినేట్ కంటెస్టెంట్లను ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ఈ ఫ్యామిలీ వీక్ బాగా ఉపయోగపడుతుంది.
లేని ఉపయోగం
అందుకే ఇప్పటికే ఓట్లతో టాప్ లో ఉన్న శివాజీని ఇంకా కాపాడేందుకు ముందుగా ఆయన కొడుకును హౌజ్ లోకి పంపించారు. తర్వాత గౌతమ్, భోలే, అమర్ రిలేటివ్స్ ని పంపించారు. దీంతో వారికి ఓట్లు పడే అవకాశం ఉంటుందని. కానీ, ఇన్నాళ్లు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చిన రతిక పేరెంట్స్ ను మాత్రం శుక్రవారం ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో పంపించనున్నారు. దాంతో ఆమెకు ఉపయోగపడేది ఏముండదు. ఎందుకంటే శుక్రవారంతో ఓటింగ్ పోల్స్ క్లోజ్ అవుతాయి. అప్పుడు రతికకు పాజిటివిటీ వచ్చిన చేసేది ఏముండదు.
శనివారం నాడే ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌లో అప్పటివరకు తీవ్రమైన నెగెటివిటీ మూటగట్టుకున్న శ్రీసత్యకు ఫ్యామిలీ వీక్ తర్వాత చాలా పాజిటివిటీ పెరిగింది. అలాగే రతికకు కూడా ఎంతో కొంత పాజిటివిటీ వచ్చేది. కానీ, అలా జరగకుండా ఎలిమినేషన్ చేయాలనే ఉద్దేశంతోనే ఫ్యామిలీ వీక్ ద్వారా తన ముద్దుబిడ్డను తొక్కేసాడు బిగ్ బాస్. కాగా ఈ వారం ఎలిమినేషన్ సండే కాకుండా శనివారం నాటి ఎపిసోడ్‌లోనే చేయనున్నారని సమాచారం.