Hanuman Movie:ప్రీ రిలీజ్‌కు చిరంజీవి - సక్సెస్‌మీట్‌కు బాలకృష్ణ - హనుమాన్ ప్రమోషన్స్ ప్లానింగ్ అదిరిందిగా
Hanuman Movie: హనుమాన్ సక్సెస్‌మీట్‌ను త్వరలోనే గ్రాండ్‌గా నిర్వహించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సక్సెస్ మీట్‌కు బాలకృష్ణ గెస్ట్‌గా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Hanuman Movie: సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతోంది. ఐదు రోజుల్లో ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరింది. హిందీలోను దుమ్మురేపుతోన్న ఈ మూవీ మంగళవారం నాటికి 18 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నది. హనుమాన్ జోరు చూస్తుంటే ఈజీగా రెండు వందల కోట్ల మైలురాయిని దాటుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తెలుగులో ఇరవై ఐదు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఐదు రోజుల్లోనే యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. నిర్మాతలకు ఇరవై ఐదు కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది. 2024లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా హనుమాన్ నిలిచింది.
హనుమాన్ సినిమా చూసిన బాలయ్య
హనుమాన్ మూవీని మంగళవారం బాలకృష్ణ ప్రత్యేకంగా వీక్షించారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో బాలకృష్ణ కోసం హనుమాన్ స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటుచేశారు. ఈ షోకు బాలకృష్ణ, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జాతో పాటు కొంతమంది టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.
బాలకృష్ణ సినిమా చూసిన వీడియోను మైత్రీ మూవీస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. హనుమాన్ కన్నుల పండువగా ఉందని బాలకృష్ణ ప్రశంసలు కురిపించాడు. సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నాడు. ఫొటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్ బాగుందని, ఆర్టిస్టులందరూ బాగా నటించారని, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాతోమాయ చేశారని బాలకృష్ణ మెచ్చుకున్నాడు. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ అని తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సక్సెస్ మీట్‌కు బాలయ్య....
త్వరలోనే తెలుగు వెర్షన్‌కు సంబంధించి హనుమాన్ సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిసింది. ఈ సక్సెస్ మీట్‌కు బాలకృష్ణ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు సమాచారం. హనుమాన్ సక్సెస్‌పై బాలకృష్ణ రియాక్షన్ ఏమిటన్నది సక్సెస్ మీట్‌లోనే డీటెయిలింగ్‌గా రివీల్ కానున్నట్లు సమాచారం. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి గెస్ట్‌గా వచ్చాడు. ఇప్పుడు సక్సెస్ మీట్‌కు బాలకృష్ణ రాబోతున్నట్లు వార్తలు రావడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హనుమాన్ మూవీ కన్నడ వెర్షన్‌ను శివరాజ్‌కుమార్ వీక్షించినట్లు సమాచారం. కన్నడ సక్సెస్ మీట్‌క శివరాజ్‌కుమార్ గెస్ట్‌గా వస్తాడని అంటున్నారు.
బాలకృష్ణతో మూవీ...
బాలకృష్ణతో దర్శకుడు ప్రశాంత్ వర్మకు చక్కటి అనుబంధముంది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో ప్రోమోస్‌కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. బాలకృష్ణకు ఓ కథ చెప్పినట్లు హనుమాన్ ప్రమోషన్స్‌లో ప్రశాంత్ వర్మ చెప్పాడు. తెలుగులో ఇప్పటివరకు రాని డిఫరెంట్ జోనర్‌లో ఈ మూవీ ఉండబోతున్నట్లు ప్రకటించాడు. హనుమాన్ సక్సెస్ నేపథ్యంలో బాలకృష్ణ, ప్రశాంత్ వర్మ మూవీ రావడం పక్కా అంటూ ప్రచారం జరుగుతోంది.
అంజనాద్రి బ్యాక్‌డ్రాప్...
హనుమాన్ మూవీని అంజనాద్రి అనే ఫిక్షనల్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. తేజా సజ్జా సోదరిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది. కోలీవుడ్ నటుడు వినయ్ రాయ్ విలన్‌గా కనిపించాడు. హనుమాన్‌కు జై హనుమాన్ పేరుతో సీక్వెల్ రాబోతోంది.