Toyota Kirloskar's Vikram Kirloskar dies: విక్రమ్ కిర్లోస్కర్ హఠాన్మరణం
Toyota Kirloskar's Vikram Kirloskar dies: భారత్ లోని టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ మరణించారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో విక్రమ్ చనిపోయారని టయోటా కిర్లోస్కర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Toyota Kirloskar's Vikram Kirloskar dies: భారత్ లోని ప్రముఖ ఆటోమోటివ్ సంస్థల్లో ఒకటైన టయోటా కిర్లోస్కర్ కు వైస్ చైర్మన్ గా బాధ్యతల్లో ఉన్న విక్రమ్ కిర్లోస్కర్ మంగళవారం గుండెపోటుతో చనిపోయారు. భారత ఆటోమోటివ్ ఇండస్ట్రీకి విక్రమ్ కిర్లోస్కర్ ను పెద్ద దిక్కుగా భావిస్తారు. అత్యంత తీవ్రంగా గుండెపోటు రావడంతో మంగళవారం విక్రమ్ కిర్లోస్కర్ చనిపోయారని సంస్థ వెల్లడించింది.
Toyota Kirloskar's Vikram Kirloskar dies: బెంగళూరులో అంత్యక్రియలు..
విక్రమ్ కిర్లోస్కర్ అంత్యక్రియలు బంధు, మిత్రుల అశ్రునయనాల మధ్య బుధవారం బెంగళూరులోని హెబ్బల్ క్రెమటోరియంలో జరిగాయి. విక్రమ్ కిర్లోస్కర్ ఆకస్మిక మృతి పట్ల పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కిర్లోస్కర్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. Vikram Kirloskar ఆకస్మిక మరణం తనను షాక్ కు గురిచేసిందని బయోకాన్ ఫార్మాస్యూటికల్స్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. విక్రమ్ తనకు అత్యంత ఆప్తుడైన స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. గీతాంజలి మానసికి, విక్రమ్ ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానన్నారు. విక్రమ్ హఠాన్మరణం పట్ల కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విక్రమ్ కిర్లోస్కర్(Vikram Kirloskar) తనకు మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు. జపాన్ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టొయోటా భాగస్వామ్యంతో కిర్లోస్కర్ భారత్ లో విస్తృత శ్రేణి వాహనాలను ఉత్పత్తి చేస్తోంది.
టాపిక్