Tata Tiago NRG CNG variant: 7.5 లక్షలకు టాటా టియాగో సీఎన్జీ వర్షన్
Tata Tiago NRG CNG variant: ప్యాసెంజర్ కార్ల కేటగిరీలో సరికొత్త మోడల్స్ తో దూసుకుపోతున్న టాటా సంస్థ కొత్తగా తన టియాగో ఎన్ఆర్జీ(Tata Tiago NRG) మోడల్ లో సీఎన్జీ వేరియంట్లను విడుదల చేసింది.
Tata Tiago NRG CNG variant: టియాగో సీఎన్జీలో(Tata Tiago NRG) రెండు వేరియంట్లు సంస్థ విడుదల చేసింది. ఒకటి ఎక్స్ టీ(XT), మరొకటి ఎక్స్ జడ్(XZ). ఈ రెండు వేరియంట్లలోనూ డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Tiago NRG CNG price: 7.5 లక్షల రూపాయలు
టాటా టియాగో ఎన్ఆర్జీ సీఎన్జీ ఎక్స్ టీ(Tata Tiago NRG CNG XT) మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.4 లక్షలుగా నిర్ధారించారు. ఇది పెట్రోల్ మోడల్ కన్నా రూ. 90 వేలు ఎక్కువ. అలాగే, టాటా టియాగో ఎన్ఆర్జీ సీఎన్జీ ఎక్స్ జడ్(Tata Tiago NRG CNG) XZ వేరియంట్ రూ. 7.8 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో వస్తోంది. ఈ రెండు వేరియంట్లలోనూ సీఎన్జీ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు.
Tiago NRG CNG specifications: 1.2 లీటర్ రివొట్రాన్ ఇంజిన్
ఈ Tiago NRG CNG మోడల్ లో 1.2 లీటర్ 3 సిలిండర్ రివొట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 72 బీహెచ్పీ, 95 ఎన్ఎమ్ పీక్ టార్క్ పవర్ ఔట్ పుట్ ను ఇస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను అమర్చారు.
7 inch digital display: 7 అంగుళాల డిజిటల్ డిస్ ప్లే
ఈ మోడళ్లకు డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే తో పాటు 7 అంగుళాల డ్రైవర్ ఇన్ఫోటైన్ మెంట్ డిస్ ప్లే ను అమర్చారు. అలాగే, కూల్డ్ గ్లోవ్ బాక్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే లను సపోర్ట్ చేస్తుంది. రెండు మోడళ్లలోనూ రియర్ పార్కింగ్ అసిస్ట్ సెన్సార్, రియర్ వాష్ వైపర్ ఉన్నాయి.
iCNG technology: ఐ సీఎన్జీ టెక్నాలజీ..
ఈ మోడళ్లలో iCNG technology ని వినియోగించారు. ఒకవేళ గ్యాస్ లీక్ లాంటి సమస్యలు తలెత్తితే, ఆటోమేటిక్ గా సీఎన్జీ మోడ్ నుంచి పెట్రోల్ మోడ్ కు మారుతుంది. ఈ మోడళ్లు Midnight Plum, Flame Red, Arizona Blue, Opal White, Daytone Grey కలర్లలో లభిస్తాయి.
టాపిక్