Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..-stocks to buy today 3 december 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​! ఈ బ్రేకౌట్​ స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్​..

Sharath Chitturi HT Telugu
Dec 03, 2024 08:15 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 445 పాయింట్లు పెరిగి 80,248 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 145 పాయింట్లు వృద్ధి చెంది 24,276 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 53 పాయింట్లు పెరిగి 52,109 వద్దకు చేరింది.

“నిఫ్టీ 50 ఇండెక్స్ షార్ట్​టర్మ్​ ట్రెండ్​ సానుకూలంగా ఉంది. వచ్చే రెండు సెషన్లలో 24350 పైనే కొనసాగితే, తదుపరి రెసిస్టెన్స్ జోన్ 24700-24900 స్థాయిల వైపు పయనించవచ్చు,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. 24100 వద్ద సపోర్ట్​ ఉందని పేర్కొన్నారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 238.28 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3588.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.29శాతం పడింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.24శాతం పెరిగింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.97శాతం వృద్ధిచెందింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

అఫిల్​ ఇండియా లిమిటెడ్​- బై రూ. 1736.2, స్టాప్​ లాస్​ రూ. 1670, టార్గెట్​ రూ. 1870

ఇగరాశి మోటార్స్​- బై రూ . 823.15, స్టాప్​ లాస్​ రూ. 796, టార్గెట్​ రూ. 875.

టాటా కమ్యూనికేషన్స్​- బై రూ. 1790, స్టాప్​ లాస్​ రూ. 1740, టార్గెట్​ రూ. 1850

ఆర్​బీఎల్​ బ్యాంక్​- బై రూ. 156, స్టాప్​ లాస్​ రూ. 150, టార్గెట్​ రూ. 165

ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్​- బై రూ. 143.75, స్టాప్ ​లాస్​ రూ. 140, టార్గెట్​ రూ. 148

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

నెల్కో: రూ.1234.90 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1305, స్టాప్ లాస్ రూ.1192;

మాలు పేపర్ మిల్స్: రూ.52.96కు కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.57, స్టాప్ లాస్ రూ.51;

పోకర్ణ: రూ.1225.10 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1333, స్టాప్ లాస్ రూ.1180;

డీఎంసీసీ: రూ.328.50, టార్గెట్ రూ.350, స్టాప్ లాస్ రూ.316;

సియారాం సిల్క్ మిల్స్: రూ.866.85 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ.930, స్టాప్ లాస్ రూ.835.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం