Stocks to buy today : ఈ రూ. 170 'బ్రేకౌట్​ స్టాక్​' కొంటే షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!-stocks to buy today 12th august 2024 sensex and nifty news latest ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stocks To Buy Today : ఈ రూ. 170 'బ్రేకౌట్​ స్టాక్​' కొంటే షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Stocks to buy today : ఈ రూ. 170 'బ్రేకౌట్​ స్టాక్​' కొంటే షార్ట్​ టర్మ్​లో భారీ లాభాలు!

Sharath Chitturi HT Telugu
Aug 12, 2024 08:15 AM IST

Stocks to buy today : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

స్టాక్స్​ టు బై టుడే..
స్టాక్స్​ టు బై టుడే..

Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాలతో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 820 పాయింట్లు పెరిగి 70,706 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 251 పాయింట్లు పెరిగి 24,368 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 328 పాయింట్లు పెరిగి 50,485 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ ట్రెండ్​.. రేంజ్​బౌండ్​గా ఉంది. 24,400- 24,450 దగ్గర రెసిస్టెన్స్​ ఉంది. నిఫ్టీ దానిని అదిగమిస్తే అప్​ట్రెండ్​ ప్రారంభం అవ్వొచ్చు. 24,750 వరకు వెళ్లొచ్చు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 406.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,979.59 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవావారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప నష్టాలతో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగిశాయి. డౌ జోన్స్​ 0.13శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.47శాతం వృద్ధిచెందింది. నాస్​డాక్​ 0.51శాతం మేర లాభాలను చూసింది.

సెబీ చీఫ్​పై హిండెన్​బర్గ్​ ఆరోపణలు- స్టాక్​ మార్కెట్​పై ప్రభావం ఎంత?

సెబీ చీఫ్​ మాధవి పురి బచ్​, ఆమె భర్త ధవల్​ బచ్​లపై ప్రముఖ షార్ట్​ సెల్లింగ్​ సంస్థ హిండెన్​బర్గ్​ చేసిన ఆరోపణలు ప్రస్తుతం వార్తల్లో నిలిచాయి. అదానీ గ్రూప్​ స్టాక్స్​ని ఆర్టిఫీషియల్​గా పెంచేందుకు ఉపయోగించిన మారిషస్​ అఫ్​షోర్​ ఫండ్స్​లో మాధవి, ధవల్​ బచ్​లకు వాటాలు ఉన్నట్టు హిండెన్​బర్గ్​ పేర్కొంది. ఈ మేరకు విజిల్​ బ్లోయర్​ నుంచి తమకు సమాచారం ఉందని వివరించింది. అందుకే అదానీ గ్రూప్​పై గతేడాది సరిగ్గా విచారణ చేయలేదని పేర్కొంది. కాగా హిండెన్​బర్గ్​ తాజా ఆరోపణలను సెబీ చీఫ్​, ఆమె భర్త ఖండించారు.

ఈ పూర్తి వ్యవహారంపై స్టాక్​ మార్కెట్​లు ఎలా స్పందిస్తాయి? అనేది ఆసక్తిగా మారింది. కిందటి ఏడాది ఇదే హిండెన్‌బర్గ్ అనే సంస్థ అదానీ గ్రూపుపై ఇచ్చిన నివేదిక దెబ్బకు అదానీ షేర్లు పడిపోయాయి. కోట్లలో నష్టం వచ్చింది. అందుకే ఈ విషయాన్ని ఈజీగా తీసుకోకూడదని కొంతమంది నిపుణుల అభిప్రాయం. ఉదయం ట్రేడింగ్‌లో కొంత బలహీనతను తోసిపుచ్చలేమని అంటున్నారు. మదుపరులు, ట్రేడర్లు అస్థిరతకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కనీసం సోమవారం ట్రేడింగ్ ప్రారంభ దశల్లో కొంత బలహీనత ఉండవచ్చని మార్కెట్ నిపుణుడు అంబరీష్ బలిగా అన్నారు. ఆ తర్వాత మద్దతుగా మార్కెట్లోకి కొత్త కొనుగోళ్లు తక్కువ స్థాయిలో వస్తాయో లేదో గమనించాల్సి ఉంటుందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

స్టాక్స్​ టు బై..

సంవర్ధన్ మదర్సన్: రూ.187.75 వద్ద కొనండి, టార్గెట్ రూ.196, స్టాప్ లాస్ రూ.184

ఏబీఎఫ్ఆర్ఎల్: రూ.324.70 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.340, స్టాప్ లాస్ రూ.317

గాబ్రియేల్ ఇండియా: రూ .503.55 వద్ద కొనండి, టార్గెట్ రూ .528, స్టాప్ లాస్ రూ .492

రిలయన్స్ ఇండస్ట్రీస్: రూ.2948.60 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.3100, స్టాప్ లాస్ రూ.2865

టాటా మోటార్స్: రూ.1068.10 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.1155, స్టాప్ లాస్ రూ.1025

టెక్ మహీంద్రా లేదా టెక్ఎం: రూ .1506.70 వద్ద కొనండి, టార్గెట్ రూ .1650, స్టాప్ లాస్ రూ .1430

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

ఎంపీఎస్: రూ.2196 వద్ద, టార్గెట్ రూ.2302, స్టాప్ లాస్ రూ.2115

ట్రెంట్: రూ.6275 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.6600, స్టాప్ లాస్ రూ.6055

స్టెల్ హోల్డింగ్స్: రూ.492.30 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.515, స్టాప్ లాస్ రూ.474

ఇండో అమైన్స్: రూ.171 వద్ద కొనండి, టార్గెట్ రూ.179, స్టాప్ లాస్ రూ.164

ఆర్కిడ్ ఫార్మా: రూ.1567, టార్గెట్ రూ.1640, టార్గెట్ రూ.1510

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

Whats_app_banner

సంబంధిత కథనం