Stock market holiday today : నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు
Stock market holiday today : అంబేడ్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. పూర్తి వివరాలు..
Stock market holiday today : దలాల్ స్ట్రీట్ టేడర్స్, ఇన్వెస్టర్లకు ముఖ్యమైన వార్త. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. దేశీయ స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మూతపడి ఉండాయి. శని, ఆదివారాల సెలవు అనంతరం సోమవారం తిరిగి తెరుచుకుంటాయి. శుక్రవారం స్టాక్ మార్కెట్లో ఎలాంటి ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.
2023 స్టాక్ మార్కెట్ హాలీడేస్ లిస్ట్ ప్రకారం.. శుక్రవారం ఈక్విట సెగ్మెంట్, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎస్ఎల్బీ సెగ్మెంట్లలో ఎలాంటి కార్యకలాపాలు ఉండవు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఇందుకు కారణం.
కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రెసిప్ట్స్ (ఈజీఆర్)లలో మార్నింగ్ సెషన్.. అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెలవు. సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు పనిచేస్తాయి. ఇక ఎంసీఎక్స్, ఎన్సీడీఈఎక్స్లు ఈవినింగ్ సెషన్లో పనిచేస్తాయి.
స్టాక్ మార్కెట్ సెలవులు..
ఏప్రిల్లో స్టాక్ మార్కెట్లు ఇప్పటికే రెండు రోజులు సెలవులు తీసుకున్నాయి. ఇది మూడోది. ఏప్రిల్ 4న మహావీర్ జయంతి, ఏప్రిల్ 7వ గుడ్ ఫ్రైడే నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పనిచేయలేదు. ఇక ఈ నెలలో ఇదే చివరి హాలీడే.
మే నెలలో స్టాక్ మార్కెట్లకు కేవలం 1 రోజు మాత్రమే సెలవు ఉంటుంది. అది మే 1 (మే డే, మహారాష్ట్ర డే).
గురువారం ట్రేడింగ్ సెషన్..
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్ 38 పాయింట్లు పెరిగి 60,431 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 17,828 వద్ద స్థిరపడింది.
సంబంధిత కథనం