Simple One Electric Scooter: అదిరిపోయేలా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలివే-simple one electric scooter launched in india check top 5 key highlights ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Simple One Electric Scooter: అదిరిపోయేలా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలివే

Simple One Electric Scooter: అదిరిపోయేలా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్: తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
May 24, 2023 06:16 AM IST

Simple One Electric Scooter: సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్‍లో అడుగుపెట్టింది. ఈ స్కూటర్ గురించి ముఖ్యమైన వివరాలు ఇవే.

Simple One Electric Scooter: అదిరిపోయేలా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్
Simple One Electric Scooter: అదిరిపోయేలా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్

Simple One Electric Scooter: ఎంతో కాలం నుంచి ఎదుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయింది. ఈ స్కూటర్‌ను భారత మార్కెట్‍లోకి లాంచ్ చేసింది బెంగళూరు ఈవీ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ (Simple Energy). ఈ స్కూటర్‌కు రేంజ్ అత్యంత ఆకర్షణగా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఏకంగా 212 కిలోమీటర్ల వరకు ఈ స్కూటర్‌పై ప్రయాణించేలా రేంజ్ ఉంది. దీంతో దేశంలోనే లాంగెస్ట్ రేంజ్ ఉన్న స్కూటర్‌గా నిలిచింది. 2021 ఆగస్టులోనే ఈ స్కూటర్‌ను పరిచయం చేసిన సింపుల్ ఎనర్జీ.. ఎట్టకేలకు ఇప్పుడు లాంచ్ చేసింది. ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర, ఫీచర్లు, బ్యాటరీ సహా పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

1.ధర, కలర్ ఆప్షన్లు

Simple One Electric Scooter: సింపుల్ వన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.45లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. టాప్ వేరియంట్ ధర రూ.1.58లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. బ్రేజన్ బ్లాక్, నమ్మ రెడ్, అజుర్ బ్లూ, గ్రేస్ వైట్, బ్రేజెన్ ఎక్స్, లైట్ ఎక్స్ కలర్లలో ఈ స్కూటర్ లభిస్తోంది. జూన్ 1 నుంచి ఫేమ్-2 సబ్సిడీ తగ్గనుండటంతో.. అందుకు అనుగుణంగా ముందుగా ప్రకటించిన రూ.1.10లక్ష కాకుండా ఎక్కువ ధరకు ఈ స్కూటర్ ను తీసుకొచ్చింది. కాగా, 750 వాట్ చార్జర్‌ ధర రూ.13,000గా ఉంది. దీన్ని విడిగా కొనాల్సి ఉంటుంది.

2. బ్యాటరీ, రేంజ్

Simple One Electric Scooter: 5 కిలో వాట్ హవర్ (kWh) బ్యాటరీతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. ముందుగా 4.8kWh బ్యాటరీ అని చెప్పగా.. కాస్త ఎక్కువ సామర్థ్యంతోనే ఆ కంపెనీ తీసుకొచ్చింది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ చార్జ్ చేస్తే ఈ స్కూటర్‌పై 212 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు. ఇండియాలో లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇది అడుగుపెట్టింది. కాగా, ఈ బ్యాటరీకి ఐపీ67 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉంది. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అయ్యేందుకు సుమారు 6 గంటలు పడుతుంది.

3.పర్ఫార్మెన్స్

Simple One Electric Scooter: 8.5 kW (11.3 bhp) పీఎంఎస్ మిడ్ డ్రైవ్ మోటార్‌తో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చింది. 72 Nm పీక్ టార్క్యూను ఈ మోటార్ జనరేట్ చేయగలదు. 2.77 సెకన్లలోనే ఈ స్కూటర్ గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల (0-40 kmph) వేగానికి యాక్సలరేట్ అవుతుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 105 కిలోమీటర్లుగా ఉంది.

4.ఫీచర్లు

Simple One Electric Scooter: 7 ఇంచుల డిజిటల్ రన్నింగ్ డిస్‍ప్లేను సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ ఓఎస్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్, కాల్ అలెర్ట్స్, పార్క్ అసిస్ట్, ఓటీఏ అప్‍డేట్స్, టెలిమాటిక్స్ లాంటి ఫీచర్లు ఉంటాయి. ఎకో, రైడ్, డ్యాష్, సోనిక్ అనే నాలుగు రైడింగ్ మోడ్‍లు ఉంటాయి. 12 ఇంచుల అలాయ్ వీల్‍లపై ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రన్ అవుతుంది. ముందు 200 mm కాంబీ డిస్క్, వెనుక 190 mm డిస్క్ బ్రేక్‍లతో వచ్చింది.

5. డెలివరీలు, బుకింగ్స్

Simple One Electric Scooter: జూన్ 6వ తేదీ నుంచి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు చేస్తామని సింపుల్ ఎనర్జీ ప్రకటించింది. ముందుగా బెంగళూరులో డెలివరీలు ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఆ తర్వాత వేరే సిటీల్లో డెలివరీలు చేస్తామని పేర్కొంది. సుమారు సంవత్సరంన్నర క్రితమే ఈ స్కూటర్‌ బుకింగ్స్ ప్రారంభించటంతో ఇప్పటికే లక్ష వరకు బుకింగ్స్ వచ్చాయని సింపుల్ ఎనర్జీ పేర్కొంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ జరుగుతున్నాయి. సింపుల్ ఎనర్జీ అఫీషియల్ వెబ్‍సైట్‍లో బుక్ చేసుకోవచ్చు. ఏథెర్ 450x, ఓలా ఎస్1 ప్రో, విడా వీ1 ప్రో, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టీవీఎస్ ఐక్యూబ్‍తో ఈ సెగ్మెంట్‍లో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పోటీ పడునుంది.

Whats_app_banner