New Smartwatch Launch: నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్మార్ట్‌వాచ్ లాంచ్: సేల్ మొదలు-noise colorfit pulse 3 launched check out price features details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Noise Colorfit Pulse 3 Launched Check Out Price Features Details

New Smartwatch Launch: నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్మార్ట్‌వాచ్ లాంచ్: సేల్ మొదలు

Chatakonda Krishna Prakash HT Telugu
May 18, 2023 02:22 PM IST

Noise ColorFit Pulse 3: నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్మార్ట్‌వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. సేల్‍కు కూడా అందుబాటులోకి వచ్చింది.

New Smartwatch Launch: నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్మార్ట్‌వాచ్ లాంచ్: సేల్ మొదలు (Photo: Noise)
New Smartwatch Launch: నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్మార్ట్‌వాచ్ లాంచ్: సేల్ మొదలు (Photo: Noise)

Noise ColorFit Pulse 3: నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ లైనప్‍లో మరో స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 (Noise ColorFit Pulse 3) వాచ్‍ను దేశీయ కంపెనీ నాయిస్ (Noise) విడుదల చేసింది. పల్స్ 2కు ఇది సక్సెసర్‌గా అడుగుపెట్టింది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, 2.5D కర్వ్డ్ డిస్‍ప్లేతో నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 వచ్చింది. ఇప్పటికే ఈ వాచ్ సేల్‍ కూడా మొదలైంది. బ్లూటూత్ 5.3 వెర్షన్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Noise ColorFit Pulse 3: 1.96 ఇంచుల TFT 2.D కర్వ్డ్ గ్లాస్ డిస్‍ప్లేతో నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్మార్ట్‌వాచ్ వచ్చింది. 170కు పైగా క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. మెటాలిక్ బాడీ ఉంటుంది. నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 ట్రాకర్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెట్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లను ఈ వాచ్ కలిగి ఉంది. 100కుపైగా స్పోర్ట్స్ మోడ్‍లకు సపోర్ట్ చేస్తుంది.

Noise ColorFit Pulse 3: ట్రూసింక్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్మార్ట్‌వాచ్ వచ్చింది. ఇందుకోసం ఈ వాచ్‍లో స్పీకర్, మైక్రోఫోన్ ఉంటాయి. దీంతో మొబైల్‍కు బ్లూటూత్‍తో కనెక్ట్ చేసుకొని ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.3 వెర్షన్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్‍లోనే నోటిఫికేషన్లను పొందవచ్చు. కెమెరా, మ్యూజిక్ ప్లే బ్యాక్‍ను కంట్రోల్ చేయవచ్చు. మొబైల్‍లో నాయిస్ ఫిట్ యాప్‍కు ఈ వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు.

Noise ColorFit Pulse 3: నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్మార్ట్‌వాచ్‍లో 300mAh బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై ఏడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్ కోసం ఎక్కువగా వాడితే 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్‍కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ ఉంటుంది.

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 ధర, సేల్

Noise ColorFit Pulse 3 Price: నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ 3 స్మార్ట్‌వాచ్ ధర రూ.1,799గా ఉంది. అయితే లాంచ్ ఆఫర్ కింద ప్రస్తుతం ఈ-కామర్స్ సైట్ అమెజాన్‍లో రూ.1,599కే ఈ వాచ్ లభిస్తోంది. నాయిస్ అధికారిక వెబ్‍సైట్‍లోనూ ఈ వాచ్ అందుబాటులో ఉంది. జెట్ బ్లాక్, వింటేజ్ బ్లాక్, సిల్వర్ గ్రే, జేడ్ గ్రీన్, రోజ్ పింక్ కలర్ ఆప్షన్‍లో ఈ వాచ్ లభిస్తుంది.

WhatsApp channel