Noise ColorFit Mighty: రూ.2వేలలోపు ధరలో నాయిస్ నుంచి మరో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్: పూర్తి వివరాలివే-noise colorfit mighty smartwatch launched in india check price specifications features and more details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Noise Colorfit Mighty: రూ.2వేలలోపు ధరలో నాయిస్ నుంచి మరో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్: పూర్తి వివరాలివే

Noise ColorFit Mighty: రూ.2వేలలోపు ధరలో నాయిస్ నుంచి మరో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ లాంచ్: పూర్తి వివరాలివే

Noise ColorFit Mighty Smartwatch: నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. మెటాలిక్ డిజైన్, టీఎఫ్‍టీ డిస్‍ప్లేతో అడుగుపెట్టింది. పూర్తి వివరాలు ఇవే.

Noise ColorFit Mighty: రూ.2వేలలోపు ధరలో నాయిస్ నుంచి మరో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ (Photo: Noise)

Noise ColorFit Mighty Smartwatch: దేశీయ కంపెనీ నాయిస్ వరుసగా స్మార్ట్‌వాచ్‍లను మార్కెట్‍లోకి తెస్తూనే ఉంది. కొత్తకొత్త మోడళ్లను ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా బడ్జెట్ రేంజ్‍లో మరో బ్లూటూత్ కాలింగ్ వాచ్‍ను తీసుకొచ్చింది. నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ ఇండియాలో లాంచ్ అయింది. మెటాలిక్ ఫినిష్‍తో లుక్ పరంగా కాస్త ప్రీమియమ్‍గా ఈ వాచ్ కనిపిస్తోంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ వెర్షన్ 5.3ని కలిగి ఉంది. ఈ నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ వివరాలివే..

నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ వచ్చింది. బ్లూటూత్ 5.3 వెర్షన్‍ను కలిగి ఉంది. బ్లూటూత్ ద్వారా ఫోన్‍కు పెయిర్ చేసుకొని వాచ్‍ ద్వారా కాల్స్ మాట్లాడవచ్చు. వాచ్‍లోనే నోటిఫికేషన్లను పొందవచ్చు. ఫోన్‍లో నాయిస్‍ఫిట్ యాప్‍కు ఈ వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు.

1.96 ఇంచుల టీఎఫ్‍టీ డిస్‍ప్లేను నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. 500 నిట్స్ వరకు బ్రైట్‍నెస్ ఉంటుంది. 360 డిగ్రీలు రొటేట్ చేసుకునేలా.. వాచ్‍లోని ఆప్షన్‍లను యాక్సెస్ చేసుకునేందుకు క్రౌన్ ఉంది. స్లీక్, మోటాలిక్ బాడీతో ప్రీమియమ్ లుక్‍ను ఈ వాచ్ కలిగి ఉంది. 100కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

110కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ సపోర్ట్ చేస్తుంది. హృదయ స్పందనలను కొలిచే హార్ట్ రేట్ మానిటరింగ్‍తో పాటు ఎస్‍పీఓ 2, స్లీప్ ట్రాకర్ హెల్త్ ఫీచర్లతో ఈ వాచ్ వచ్చింది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల వరకు ఈ వాచ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని నాయిస్ తెలిపింది. వాటర్, డస్ట్ నుంచి రక్షణ కోసం ఐపీ67 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.

నాయిస్ కలర్‌ఫిట్ మైటీ ధర, సేల్

నాయిస్ కలర్‌ఫిట్ మైటీ స్మార్ట్‌వాచ్ ధర రూ.1,999గా ఉంది. నాయిస్ అధికారిక వెబ్‍సైట్ gonoise.com ఇప్పటికే ఈ వాచ్ సేల్‍కు వచ్చింది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్ లోనూ ఇదే రోజు సేల్‍కు వస్తుంది. జెట్ బ్లాక్, కామ్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, బర్గండీ వైన్, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ అందుబాటులోకి వచ్చింది.

కాగా, ఇటీవలే ‘నాయిస్ కలర్‌ఫిట్ క్వాడ్ కాల్’ స్మార్ట్‌వాచ్ కూడా లాంచ్ అయింది. ఈ వాచ్ ఇంట్రడక్టరీ ధర రూ.1,499గా ఉంది. నాయిస్ వెబ్‍సైట్, అమెజాన్‍లో లభిస్తోంది. ఈ వాచ్ కూడా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను కలిగి ఉంది.