Stock market holiday : రక్షా బంధన్ వేళ స్టాక్ మార్కెట్లకు సెలవు ఉందా?
Stock market holiday Raksha Bandan : భారత స్టాక్ మార్కెట్లకు సోమవారం సెలవు ఉందా? బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఓపెన్‌లో ఉంటాయా? ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం రక్షాబంధన్! మరి దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుందా? లేదా? అని ట్రేడర్లు, ఇన్వెస్టర్స్‌లో సందేహాలు నెలకొన్నాయి. సోమవారం స్టాక్ మార్కెట్ హాలిడే అవుతుందా లేదా అనే దానిపై స్పష్టత కోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి 2024 లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా కోసం వెతకడం మంచిది.
2024 ఆగస్టులో స్టాక్ మార్కెట్ సెలవులు..
ఇలాంటి గందరగోళాన్ని నివారించడానికి bseindia.com వెళ్లి పైన ఉన్న 'ట్రేడింగ్ హాలిడేస్' ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి. 'ట్రేడింగ్ హాలిడేస్' ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత 2024లో స్టాక్ మార్కెట్ సెలవుల పూర్తి జాబితా ఓపెన్ అవుతుంది. స్టాక్ మార్కెట్ సెలవుల ఈ జాబితాలో, ఆగస్టులో ఒకే ఒక ట్రేడింగ్ సెలవు ఉంది. అది 2024 ఆగస్టు 15న. స్వాతంత్ర్య దినోత్సవం సదర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సెలవు తీసుకున్నాయి. తదుపరి ట్రేడింగ్ సెలవు 2024 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున వస్తుంది. అంటే రక్షాబంధన్ సందర్భంగా సోమవారం భారత స్టాక్ మార్కెట్లకు సెలవు లేదు. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల కార్యకలాపాలు యథావిథిగా కొనసాగుతాయి.
ఇదీ చూడండి:- Multibaggar stock alert : ఐపీఓ నుంచి 3 నెలల్లో 75శాతం పెరిగిన మల్లీబ్యాగర్ స్టాక్- ఇప్పుడు కొనొచ్చా?
2024లో స్టాక్ మార్కెట్ సెలవులు..
2024లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ప్రకారం.. 2024లో 15 ట్రేడింగ్ సెలవులు ఉంటాయి. ఆగస్టు 15, 2024 తర్వాత, ప్రస్తుత సంవత్సరంలో మరో నాలుగు స్టాక్ మార్కెట్ సెలవులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 2024 అక్టోబర్ 2 (మహాత్మాగాంధీ జయంతి), 2024 నవంబర్ 1 (దీపావళి/ లక్ష్మీ పూజ), 15 నవంబర్ 2024 (గురునానక్ జయంతి), 25 డిసెంబర్ 2024 (క్రిస్మస్) ఆ నాలుగు ట్రేడింగ్ సెలవులు.
2024 స్టాక్ మార్కెట్ సెలవుల పూర్తి జాబితా ఇదే
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో..
అమెరికా ఆర్థిక మాంద్యం భయాలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసింది. నిఫ్టీ 396 పాయింట్లు లాభపడి 24,540 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,330 పాయింట్లు లాభపడి 80,436 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 788 పాయింట్లు లాభపడి 50,515 వద్దకు చేరింది. బ్రాడ్ మార్కెట్లో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.70 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.80 శాతం పెరిగాయి. ఇంట్రాడేలో ఐటీ, రియల్టీ 2 శాతానికి పైగా లాభపడటంతో అన్ని రంగాలు గ్రీన్‌లో ముగిశాయి.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 766.5 కోట్లు విలువ చేసే షేర్లను కొనగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,606.18 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఎఫ్ఐఐలు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 28976.91 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. డీఐఐలు రూ. 34060.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
సంబంధిత కథనం