Infosys fires 600 freshers: ఇన్ఫోసిస్ నుంచి 600 మంది ఫ్రెషర్స్‌పై వేటు
Infosys fires 600 freshers: ఇన్ఫోసిస్ నుంచి 600 మంది ఫ్రెషర్స్‌పై వేటు పడింది. ఇంటర్నల్ అసెస్‌మెంట్ టెస్టుల్లో విఫలమైనందునే ఫ్రెషర్లలో వందలాది మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
ఇంటర్నల్ అసెస్‌మెంట్ టెస్ట్‌లను క్లియర్ చేయడంలో విఫలమవడంతో ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న వందలాది మంది ఫ్రెషర్స్‌ను కంపెనీ తొలగించినట్టు బిజినెస్ టుడే నివేదించింది. పరీక్షలలో విఫలమైన తర్వాత ఈ మధ్య కాలంలో 600 మంది ఉద్యోగులను తొలగించారు. ఈ 600 మంది ఫ్రెషర్స్‌లో 208 మందిని రెండు వారాల క్రితం తొలగించినట్లు ఈ నివేదిక పేర్కొంది.
గత ఏడాది జులైకి ముందు జాయినయిన వారు అసెస్‌మెంట్ ఫెయిలైనప్పటికీ వారిపై ప్రభావం పడలేదని బిజినెస్ టుడే నివేదించింది.
‘నేను ఆగస్ట్ 2022లో ఇన్ఫోసిస్‌లో పని చేయడం ప్రారంభించాను. SAP ABAP స్ట్రీమ్ కోసం శిక్షణ పొందాను. నా బృందంలోని 150 మందిలో 60 మంది మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారందరినీ రెండు వారాల క్రితం తొలగించారు. జూలైలో చేరిన వారి నుండి మొత్తం 150 మందిలో 85 మందిని తొలగించారు..’ అని ఒక ఫ్రెషర్‌ను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.
అయితే కంపెనీ ప్రతినిధి ఈ క్లెయిమ్‌ను ఖండిస్తూ అంతర్గత పరీక్షల్లో విఫలమైతే ఉద్యోగాల కోతకు దారితీస్తుందని బిజినెస్ టుడేకి చెప్పారు. విప్రో కూడా ఇలాగే చేయడంతో దాదాపు ఎంట్రీ లెవల్‌లో ఉన్న 450 మంది ఉద్యోగాలు కోల్పోయారని వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇన్ఫోసిస్‌లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. కాగా ఇప్పటికే చాలా మంది ఫ్రెషర్లు ఐటీ కంపెనీల నుంచి ఆఫర్ పొంది ఉద్యోగంలో చేరేందుకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది.