తెలుగు న్యూస్ / ఫోటో /
Yezdi | రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌కు పోటీగా యెజ్డీ అడ్వెంచర్ ; ఫోటో స్టోరీ
- ఒకప్పటి యూత్ ఐకాన్‌గా నిలిచిన యెజ్డీ బైక్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌కు పోటీగా 'యెజ్డీ అడ్వెంచర్' బైక్ మార్కెట్లో విడుదలైంది. స్లిక్ సిల్వర్, మంబో బ్లాక్, రేంజర్ కామో అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది.
- ఒకప్పటి యూత్ ఐకాన్‌గా నిలిచిన యెజ్డీ బైక్ మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌కు పోటీగా 'యెజ్డీ అడ్వెంచర్' బైక్ మార్కెట్లో విడుదలైంది. స్లిక్ సిల్వర్, మంబో బ్లాక్, రేంజర్ కామో అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది.
(1 / 8)
యెజ్డీ నుంచి రోడ్‌స్టర్, స్క్రాంబ్లర్, అడ్వెంచర్ అనే మూడు వేరియంట్స్ విడుదల కాగా, ఇందులో Yezdi అడ్వెంచర్ బైక్ సాహస ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఇందులోని ఫీచర్స్ మిగతా రెండింటి కంటే మెరుగ్గా, అడెంచర్స్ చేయడానికి అనువుగా ఉన్నాయి. ఈ బైక్‌లో సాడిల్ స్టే సిస్టమ్‌తో పాటు, మూడు వైపులా బంగీ కార్డ్ మౌంట్ పాయింట్‌లు ఇచ్చారు.
(2 / 8)
యెజ్డీ అడ్వెంచర్ సింగిల్ LED హెడ్‌లైట్ యూనిట్‌ను కలిగి ఉంది, దీనికి రక్షణగా మెటల్ కేసింగ్ ఇచ్చారు. డ్యూయల్ క్రెడిల్ ఛాసిస్‌తో వస్తున్న ఈ బైక్‌లో సింగిల్ సైడ్ ఎగ్జాస్ట్ కూడా ఉంది.
(3 / 8)
బరువు ప్రకారం చూస్తే యెజ్డీ అడ్వెంచర్ బైక్ బరువు 188 కిలోలుగా ఉంది. మిగతా రెండు మోటార్‌సైకిళ్ల వేరియంట్లలో ఇదే అధిక బరువును కలిగి ఉంది. ఈ బైక్ 1,465 mm వీల్‌బేస్ కలిగి ఉంది. ముందు వైపు 21-అంగుళాలు, వెనకవైపు 17-అంగుళాల చక్రాలు అమర్చారు. యెజ్డీ అడ్వెంచర్ గ్రౌండ్ క్లియరెన్స్ 220 మిమీగా ఉంది.
(4 / 8)
యెజ్డీ అడ్వెంచర్‌లో 334cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్ ను అమర్చారు. దీనిని 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేశారు. ఇది గరిష్టంగా 30.2 PS శక్తిని, 29.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
(5 / 8)
సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, కాయిల్ స్ప్రింగ్ అలాగే వెనుక వైపున కాయిల్ స్ప్రింగ్, లింకేజ్ మెకానిజంతో కూడిన మోనో షాక్ అబ్జార్బర్‌లు ఇచ్చారు.
(6 / 8)
యెజ్డీ అడ్వెంచర్‌ను LCD డిజిటల్ డిస్‌ప్లేతోతో అందిస్తున్నారు. ఇది రైడ్ చేసే వారికి అనువుగా ఎలా కావాలన్నా టిల్ట్ చేసుకోవచ్చు. ఇది యెజ్డీ అడ్వెంచర్ బైక్ స్టాండర్డ్ ఫీచర్ అని ఉత్పత్తిదారులు చెప్పారు. ఈ బైక్ లో టర్న్-బై-టర్న్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉంది.
(7 / 8)
యెజ్డీ అడ్వెంచర్‌ను దీని అధికారిక బ్రాండ్ యాప్‌తో బ్లూటూత్ ద్వారా పెయిర్ చేసుకోవచ్చు. ఈ యాప్ సహాయంతో అనేకమైన ఫీచర్లు పొందవచ్చు. లొకేషన్ సెర్చ్ చేయడం, గమ్యస్థానాలను గుర్తించడం, డిస్‌ప్లేలో టర్న్-బై-టర్న్ నావిగేషన్ సెట్ చేసుకోవడం లేదా ఇంటర్‌కామ్‌లో నావిగేషన్ కామెంటరీ వినడం లాంటివి చేయవచ్చు. అలాగే రైడింగ్ చేసేటపుడు బైక్ గరిష్ట వేగం, ఇంజిన్ RPM, రైడ్ ముగిసిన తర్వాత సరాసరి వేగంలతో పాటు యాత్రకు సంబంధించి మొత్తం డేటాను రికార్డ్ చేసుకోగలిగే ఫీచర్స్ పొందవచ్చు.
(8 / 8)
యెజ్డీ అడ్వెంచర్ స్లిక్ సిల్వర్, మంబో బ్లాక్, రేంజర్ కామో అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది. వేరియంట్ ను బట్టి ఎక్స్ షోరూం ధరలు రూ. 2.10 లక్షల నుంచి ప్రారంభమయి రూ. 2.19 లక్షల వరకు ఉన్నాయి. ఈ కొత్త యెజ్డీ అడ్వెంచర్ బైక్‌లు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ బైక్‌లకు పోటీనిస్తాయడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇతర గ్యాలరీలు