Suzuki-Toyota సంయుక్తంగా D22 పేరుతో రూపొందిస్తున్న SUV వివరాలు లీక్!
- ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారులు సుజుకి- టయోటా సంయుక్తంగా ఒక మిడ్ రేంజ్ SUVని రూపొందిస్తున్నాయి. D22 అనే కోడ్‌తో రూపొందుతున్న SUV ఈ ఏడాదిలోనే భారత మార్కెట్లోకి విడుదల కాబోతుంది. ఈ వాహనానికి సంబంధించిన కొన్ని విషయాలు బయటకు లీక్ అవుతున్నాయి. అవేంటో చూడండి..

(1 / 6)
మారుతీ సుజుకి - టయోటా కలిసి పనిచేస్తున్నాయి. సంయుక్తంగా కొత్త కాంపాక్ట్ SUVని అభివృద్ధి చేస్తున్నాయి. ఈ వాహనం భారత మార్కెట్లో విజయవంతమైన హ్యుందాయ్ క్రెటా అలాగే కియా సెల్టోస్ వంటి కార్లకు పోటీగా ఉంటుంది. త్వరలో రాబోయే ఈ వాహనానికి D22 SU అనే కోడ్ నేమ్ ఇచ్చారు.(Facebook/Anit Katiyar)
(2 / 6)
ఇక్కడ డిజైన్ కనిపించకుండా కవర్ తొడిగిన ఈ వాహనం ఫోటోలు నిగూఢంగా తీసినవి. ఇది సుజుకి-టయోటా నుంచి రాబోతున్న D22 SUV. ఫోటోల్లో చూస్తే రాబోయే వాహనానికి హై-మౌంటెడ్ LED DRL లైట్లు, టర్న్ ఇండికేటర్‌లు అమర్చారు.(Facebook/Anit Katiyar)
(3 / 6)
D22 SUV వెనుక భాగం జాలు వారినట్లుగా కొందికి నొక్కినట్లుగా డిజైన్ చేశారు. పదునైన టిప్ కలిగిన యాంటెన్నాతో పాటు వెనుక భాగంలో చిన్న రూఫ్ స్పాయిలర్ కూడా ఉంది.(Facebook/Anit Katiyar)
(4 / 6)
రాబోయే D22 SUVలోని బంపర్ వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా వాహనం నిర్మాణం దృఢంగా కనిపిస్తుంది.(Facebook/Anit Katiyar)
(5 / 6)
ఈ SUV ప్రపంచవ్యాప్తంగా సుజుకి- టయోటా మధ్య భాగస్వామ్యానికి, అలాగే ఉమ్మడి వ్యాపార అభివృద్ధికి నాంది అవుతుంది.(Facebook/Anit Katiyar)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు