Railway Tickets : డిజిటల్‌గా టికెట్ చెకింగ్.. రైలు ఎక్కే చోటు ముందే చెప్పేయాలి-railway ticket checking digital in vijayawada railway division ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Railway Tickets : డిజిటల్‌గా టికెట్ చెకింగ్.. రైలు ఎక్కే చోటు ముందే చెప్పేయాలి

Railway Tickets : డిజిటల్‌గా టికెట్ చెకింగ్.. రైలు ఎక్కే చోటు ముందే చెప్పేయాలి

Anand Sai HT Telugu
Oct 09, 2022 02:49 PM IST

Hand Held Terminals : విజయవాడ రైల్వే డివిజన్ 99 శాతం రైళ్లలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్‌లకు(టీటీఈ) హ్యాండ్‌హెల్డ్ టెర్మినల్స్ (హెచ్‌హెచ్‌టి) జారీ చేసింది. తద్వారా టిక్కెట్‌లను సులభంగా తనిఖీ చేయోచ్చు.

విజయవాడ రైల్వే స్టేషన్
విజయవాడ రైల్వే స్టేషన్

విజయవాడ రైల్వే డివిజన్లో(Vijayawada Railway Division) హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ ప్రవేశపెట్టారు. 99 శాతం టీటీఈ(TTE)లో వీటినే ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా టికెట్ చెకింగ్ ఈజీగా అయిపోతుంది. ముఖ్యంగా రిజర్వ్ చేసిన టిక్కెట్‌లపై ప్రయాణించే వారిపై సరైన నిర్ణయం తీసుకోవచ్చు. డివిజన్‌లోని మొత్తం 250 ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 248 బోర్డులో ఉన్న టీటీఈలకు 417 హెచ్‌హెచ్‌టీలు జారీ చేశారు. HHT పరికరం.. రిజర్వ్ చేసిన టిక్కెట్‌పై ప్రయాణించే వ్యక్తి గురించి నిర్ధారిస్తుంది. రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికుడు రాకపోతే.. వారి సీట్లు RAC / వెయిట్‌లిస్ట్ ప్రయాణికులకు కేటాయిస్తుంది.

విజయవాడ డివిజన్.. విజయవాడలోని రోజువారీ ఇంటర్‌సిటీ(Intercity) రైళ్లలో పైలట్ ప్రాతిపదికన ఈ హ్యాండ్‌హెల్డ్ టెర్మినల్‌(Hand Held Terminals)లను ఉపయోగించింది. టిక్కెట్ చెకింగ్(Ticket Checking) సిబ్బంది అద్భుతమైన ఫలితాలు వస్తున్నట్టుగా చెప్పారు. అత్యుత్తమ ఫీడ్‌బ్యాక్‌తో రావడంతో విజయవాడ డివిజన్‌లో ఇప్పుడు 99 శాతం రైళ్లలో HHTలు ప్రవేశపెట్టారు.

ప్రయాణికులు.. వారి ప్రయాణం ప్రారంభించే స్టేషన్‌లలో రైళ్లలో ఎక్కాలని లేదంటే.. బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ వారు అలా చేయకపోతే.. వారి సీట్లు ఖాళీగా నిర్ధారించుకుని.. RAC / వెయిట్‌లిస్ట్ ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా కేటాయిస్తారు. రిజర్వ్ చేసిన టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు.. తదుపరి స్టేషన్లలో ఎక్కినా.. తమ బెర్త్‌ను కోల్పోతారు.

'మాన్యువల్ చార్ట్‌లు పంపిణీ చేస్తున్నందున RAC / వెయిట్‌లిస్ట్ ప్రయాణికులకు ఖాళీ బెర్త్‌ల కేటాయింపు లేదా తదుపరి రిమోట్ లొకేషన్‌కు వారిని విడుదల చేయడం ఆటోమేటిక్‌గా మారింది. HHTలు ప్రయాణికులకు బెర్త్‌ల కేటాయింపులో పారదర్శకతను తీసుకువచ్చాయి. పేపర్‌ వర్క్ తగ్గిపోయింది. డిజిటల్ గా పని సులభతరం అయింది.' అని ఓ అధికారి తెలిపారు. టీటీఈలు తమ విధులను హెచ్‌హెచ్‌టీల ద్వారా సులభంగా చేస్తున్నారని అధికారి తెలిపారు. ప్రయాణం ముగింపులో HHTలు నివేదికలను రూపొందిస్తాయన్నారు.

IPL_Entry_Point