Trains Cancelled Fake: విజయవాడ మీదుగా ప్రయాణించే రైళ్ల రద్దు ఒట్టిదే…
Trains Cancelled రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కోసం వందలాది రైళ్లను రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ మీదుగా ప్రయాణించే వందలాది రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లిస్తున్నారని, దాదాపు తొమ్మిది రోజుల పాటు ఇంటర్ లాకింగ్, ఆర్‌ఆర్‌ఐ పనుల నిర్వహణ కోసం రైళ్లను రద్దు చేస్తున్నారంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం అవాస్తవమని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు.
Trains Cancel దసరా పండు సమయంలో రైలు ప్రయాణికులకు రైల్వే అధికారులు షాక్ ఇచ్చారంటూ వాట్సాప్‌లో ఓ మెసేజీ చక్కర్లు కొడుతోంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా అదనపు రైళ్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ముందస్తు షెడ్యూల్ కారణంగా వందలాది రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ రైల్వే స్టేషన్లోకి రైళ్లను అనుమతించని కారణంగా శివార్లలో ఉన్న రాయనపాడు, రామవరప్పాడు రైల్వే స్టేషన్లలో రైళ్లకు హాల్టింగ్ సదుపాయాన్ని కల్పించారని, విజయవాడ వచ్చే ప్రయాణికులు అయా స్టేషన్లలో దిగాలని అధికారులు సూచిస్తున్నారంటూ మెసేజ్ సర్కులేట్ అవుతోంది.
విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులు సుమారు తొమ్మిది రోజుల పాటు ఇబ్బందులు ఎదుర్కోనాల్సి ఉందని వచ్చిన మెసేజ్ అవాస్తవమని రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే పిఆర్ సిబ్బంది ఈ మెసేజీలను వాట్సాప్ గ్రూపుల్లో వేసి తర్వాత నాలుక కరుచుకున్నారు. కాసేపటికి తీరిగ్గా అది ఫేక్ మెసేజ్ అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నారు. రోజుకు సుమారు 300 రైళ్లు రాకపోకలు సాగించే విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునికీకరణ పనులు జరగనున్నాయని, ఈ నేపథ్యంలో వందలాది రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడనుందని చెప్పుకొచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు సుమారు 50 రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు. అలాగే మరికొన్ని రైళ్లను దారిమళ్లిస్తున్నారని ప్రకటించారు. విజయవాడ రైల్వే డివిజన్ పిఆర్ అధికారులు అన్ని గ్రూపుల్లో ఈ మెసేజీ సర్క్యులేట్ చేసి తర్వాత ఫేక్ అని ప్రకటించారు.