BJP MP GVL : ఓటమి భయంతోనే అలాంటి ప్రచారం... టీడీపీపై జీవీఎల్ ఫైర్-bjp mp gvl narasimha rao slams tdp and ycp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Bjp Mp Gvl Narasimha Rao Slams Tdp And Ycp

BJP MP GVL : ఓటమి భయంతోనే అలాంటి ప్రచారం... టీడీపీపై జీవీఎల్ ఫైర్

HT Telugu Desk HT Telugu
Apr 20, 2023 10:38 PM IST

BJP MP GVL Narasimha Rao Comments: ఏపీలో వైసీపీని గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీపై సీరియస్ కామెంట్స్ కూడా చేశారు.

బీజేపీ ఎంపీ జీవీఎల్
బీజేపీ ఎంపీ జీవీఎల్

BJP MP GVL Narasimha Rao: గత కొంతకాలంగా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు అధికార పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పగా... ప్రతిపక్ష పార్టీలు మాత్రం పొత్తులపై లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ విషయంలో ఒక్కో పార్టీ వాదన ఒక్కోలా ఉంది. ఈ క్రమంలో వైసీపీ వెనక బీజేపీ ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక జనసేన తమతో కలవకుండా చూస్తోందని పలువురు నేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీటిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఘాటుగా స్పందించారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.... వైసీపీ, బీజేపీ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార పీఠంపై నుంచి వైసీపీని పడగొట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఏపీలో తమది ప్రతిపక్ష పాత్ర అని ఎంపీ జీవీఎల్ స్పష్టం చేశారు. వైసీపీపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఇక జనసేనతో పొత్తుపై స్పందించిన జీవీఎల్... జనసేనతో మూడేళ్లుగా కలిసి పని చేస్తున్నామని చెప్పారు. జనసేన నేతలు కూడా తమ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని అన్నారు. కానీ కొందరు టీడీపీ నేతలు అక్కసుతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులపై టీడీపీ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని విమర్శించారు. తమ కూటమి(జనసేన - బీజేపీ)లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని... జనసేనతో కలిసి వెళ్లాలనేది పార్టీ నేతల అభిప్రాయం కూడా అని జీవీఎల్ చెప్పారు. టీడీపీ నేతలు బీజేపీపై పడి ఏడవటం సరికాదని హితవు పలికారు. తప్పుడు కూతలు కూస్తే సహించేది లేదన్నారు. అసలు టీడీపీ నేతలు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవద్దని కోరారు.

ఇక ప్రస్తుతం ఏపీలో స్టిక్కర్ల కాంపిటిషన్స్ నడుస్తున్నాయని జీవీఎల్ విమర్శించారు.జగనన్నే తమ భరోసా అంటూ వైసీపీ నేతలు స్టిక్కర్లు అతికిస్తున్నారని కానీ... వాటిని ప్రజలు పీకేస్తున్నారని చెప్పారు. ఇక ఇక ప్రతిపక్ష పార్టీ కూడా స్టిక్కర్లతో పోటీ పడుతోందంటూ ఎద్దేవా చేశారు. అసలు విశాఖ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం చేసిందో ఏంటో చెప్పాలని ప్రశ్నించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం