Telugu News  /  Andhra Pradesh  /  Gvl Narasimha Rao Comments On Lokesh Padayatra
బీజేపీ ఎంపీ జీవీఎల్ (ఫైల్ ఫొటో)
బీజేపీ ఎంపీ జీవీఎల్ (ఫైల్ ఫొటో) (twitter)

GVL On Lokesh : రుద్దుడు కార్యక్రమలొద్దు.. లోకేష్ పాదయాత్రపై జీవీఎల్ కామెంట్స్

05 February 2023, 19:13 ISTHT Telugu Desk
05 February 2023, 19:13 IST

GVL On Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కామెంట్స్ చేశారు. రుద్దుడు కార్యక్రమాలు చేస్తే.. లీడర్ షిప్ డెవలప్ కాదని చెప్పారు.

నారా లోకేష్(Nara Lokesh) పాదయాత్రపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు(GVL Narasimha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్ర(Lokesh Padayatra)పై పాజిటివ్ న్యూస్ కంటే.. నెగిటివ్ న్యూస్ ఎక్కువగా ఉంటోందని విమర్శించారు. నాయకత్వం అనేది స్వయంగా ప్రకాశించాలని జీవీఎల్ అభిప్రాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

పార్టీకీ ఉత్తరాధికారి లాంటి వ్యక్తికి మీడియాలో విస్తృతంగా ప్రచారం లభించడంలో ఆశ్యర్యం లేదని పేర్కొన్నారు. రుద్దుడు కార్యక్రమంతో నాయకత్వం డెవలప్ కాదని తెలుసుకోవాలని హితవు పలికారు. ఏదైనా.. ప్రజలే అంతిమంగా నిర్ణయిస్తారని తెలిపారు. లోకేష్(Lokesh) పాదయాత్ర ప్రభావం అంతగా లేదని తనకు అనిపిస్తుందన్నారు.

జనసేన(Janasena)తో పొత్తుపై కూడా జీవీఎల్ స్పందించారు. జనసేనతోనే పొత్తు ఉంటుందని తెలిపారు. సచివాలయం(Sachivalayam) ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని పేర్కొన్నారు. వైజాగ్ లో మెట్రో ఆలస్యం అయ్యేందుకు ప్రభుత్వమే కారణమని చెప్పారు. కేంద్రాన్ని ప్రశ్నించే ఎంపీలకు అవగాహన అవసరమని జీవీఎల్ హితవు పలికారు.

ఏపీలో జనసేన బీజేపీ మధ్య పొత్తు ఉందని స్పష్టం చేశారు. ఇటీవల భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భావసారూప్యత ఉన్న పార్టీలతో పొత్తు ఉంటుందని బీజేపీ తీర్మానం చేసిందన్నారు.

'పవన్ కల్యాణ్(Pawan Kalyan) జనసేన పార్టీతో పొత్తు ఉంటుంది. ఇద్దరు ముద్దు.. మూడోవారు వద్దనేదే మా విధానం. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన(BJP and Janasena) కలిసి పోటీ చేస్తాయి. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. రాష్ట్రంలో సచివాలయం ఎక్కడ ఉంటే అదే రాజధాని. ఏపీ రాజధానిగా అమరావతి విషయంలో బీజేపీ మెుదటి నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. సీఎం క్యాంప్ ఆఫీసు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సీఎం వచ్చినంత మాత్రాన అదే రాజధాని అంటే కుదరదు.' అని జీవీఎల్ వ్యాఖ్యానించారు.