YS Sharmila Apologises: ఆ కామెంట్స్ పై హిజ్రాలు సీరియస్.. క్లారిటీ ఇచ్చిన షర్మిల-ysrtp chief ys sharmila apologises to transgenders ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sharmila Apologises: ఆ కామెంట్స్ పై హిజ్రాలు సీరియస్.. క్లారిటీ ఇచ్చిన షర్మిల

YS Sharmila Apologises: ఆ కామెంట్స్ పై హిజ్రాలు సీరియస్.. క్లారిటీ ఇచ్చిన షర్మిల

Feb 22, 2023 06:22 PM IST HT Telugu Desk
Feb 22, 2023 06:22 PM IST

  • YS Sharmila News: హిజ్రాలను అవమానించాలనేది తన ఉద్దేశ్యం కానే కాదన్నారు వైఎస్ షర్మిల. నేటి సమాజంలో హిజ్రాలకు గౌరవం ఉందని... కానీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు అలాంటి గౌవరం కూడా లేదనే విషయాన్ని సభలో చెప్పే ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చారు. వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హిజ్రాల కోసం ఏమైనా చేసిందా అనే విషయాన్ని కూడా హిజ్రాలు ఆలోచించాలని కోరారు. వైఎస్ఆర్టీపీ అధికారంలోకి వస్తే... హిజ్రాలకు రుణాలతో పాటు ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీనిచ్చారు. షర్మిల ఇటీవల మహబూబాబాద్ లో నిర్వహించిన పాదయాత్రలో హిజ్రాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. హిజ్రా సంఘాలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వెంటనే ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన షర్మిల… బుధవారం క్లారిటీ ఇచ్చారు.

More