TSLPRB: నేడు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్​ టికెట్లు విడుదల - లింక్ ఇదే-today ts police constable preliminary exam hall tickets released here check how to download ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tslprb: నేడు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్​ టికెట్లు విడుదల - లింక్ ఇదే

TSLPRB: నేడు కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్​ టికెట్లు విడుదల - లింక్ ఇదే

Mahendra Maheshwaram HT Telugu
Aug 18, 2022 06:20 AM IST

ts police constable jobs: ఇవాళ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్​టికెట్లు విడుదల కానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్​ టికెట్లు
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష హాల్​ టికెట్లు (tsplrb)

Constable Exam Hall Tickets 2022: కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 8 నుంచి ఈనెల 26 రాత్రి 12 వరకు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 28న కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

మొత్తం 15,644 పోలీస్ కానిస్టేబుల్‌, 614 ఆబ్కారీ కానిస్టేబుల్‌, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్‌ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం 1601 పరీక్షా కేంద్రాలను అధికారులు ఎంపిక చేశారు. సుమారు 6,61,196 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

ఆయా పోస్టులకు సంబంధించి ప్రాథమిక పరీక్ష ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. ఆయా కానిస్టేబుల్‌ పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ పేర్కొంది. మిగతా వివరాల కోస 9393711110, 9391005006 నంబర్లకు ఫోన్ చేయవచ్చని రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది.

ఇలా డౌన్లోడ్ చేసుకోండి...

అభ్యర్థులు మొదటగా https://www.tslprb.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

'constable preliminary exam hall tickets' లింక్ పై క్లిక్ చేయాలి.

సంబంధిత వివరాలను ఎంటర్ చేస్తే మీ హాట్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ పై క్లిక్ చేసి మీ హాల్ టికెట్ పొందవచ్చు.

NOTE:

లింక్ పై క్లిక్ చేసి నేరుగా మీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ పోలీస్ రిక్రూమ్ మెంట్ బోర్డు.... ఈ నెల 7 వ తేదీన 554 పోస్టులకు ప్రాథమిక పరీక్ష నిర్వహించగా... గత వారం ప్రిలిమినరీ కీ ని విడుదల చేసింది. ఇందులో భాగంగా పలు తప్పులను గుర్తించారు. ఇంగ్లీష్‌-తెలుగు వెర్షన్‌లోని ‘A’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లినట్లు తేల్చారు. ఈ క్రమంలో ప్రతి అభ్యర్థికి 8 మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది.

ఇక ప్రిలిమినరీ పరీక్షలోని మొత్తం 200 ప్రశ్నలకు 60 మార్కులను (30%) అర్హతగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. బోర్డు తాజా నిర్ణయం నేపథ్యంలో 52 మార్కులొచ్చిన అభ్యర్థి సైతం పరీక్షలో అర్హత సాధించినట్లు అవుతుంది. ఆయా అభ్యర్థులు తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు కూడా క్వాలిఫై అవుతారు. మరో ఆరు ప్రశ్నలకు ఒకటికంటే ఎక్కువ సమాధానాలు సరైనవేనని గుర్తించారు. ‘A’ బుక్‌లెట్‌లో 54వ ప్రశ్నకు 3 సరైన సమాధానాలుండగా.. 114, 183, 186, 192, 197 ప్రశ్నలకు రెండేసి సరైన సమాధానాలున్నాయి. వీటిలో దేనికి ఆన్సర్ చేసినా మార్కులిచ్చే అవకాశం కనిపిస్తోంది.

IPL_Entry_Point