MLAs Poaching Case : ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులకు బెయిల్ - కండీషన్స్ అప్లయ్!-telangana high court bail granted for 3 accused in mlas poaching case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana High Court Bail Granted For 3 Accused In Mlas Poaching Case

MLAs Poaching Case : ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులకు బెయిల్ - కండీషన్స్ అప్లయ్!

HT Telugu Desk HT Telugu
Dec 01, 2022 12:18 PM IST

trs mlas poaching case updates: ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులకు ఊరట దొరికింది. ఈ కేసులోని ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఎమ్మెల్యేల ఎర కేసులో బెయిల్
ఎమ్మెల్యేల ఎర కేసులో బెయిల్

Bail Granted for 3 Accused in MLAs Poaching Case: ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గురువారం నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారించింది. ఈ క్రమంలో ముగ్గురు నిందితులు నందు, సింహయాజీ, రామచంద్ర భారతీలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం సిట్ ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్ స్టేషన్‌లో సరెండర్ చేయాలని పేర్కొంది. ఒక్కొక్కరు రూ.2 లక్షలు షూరిటీ ఇవ్వాలని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

ఇక ఈ కేసుకు సంబంధించిన బుధవారం హైకోర్టులో వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసులో ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలు వినిపించారు. అలాగే నిందితుల బెయిల్ పై కూడా విచారణ జరిగింది. ఇవాళ కూడా విచారణ చేపట్టిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. తప్పు చేయనప్పుడు తెలంగాణ సిట్ (Special Investigation Team) కు ఎందుకు సహకరించడం లేదు, దేనికి భయపడుతున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే బుధవారం వాదనలు వినిపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయి. నిందితులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే సిట్ దర్యాప్తు చేస్తుందని అన్నారు.

బీజేపీ తరపున దాఖలపై పిటిషన్ తరపున న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదించారు. ఈ కేసు రాజకీయ దురుద్దేశ్యంతోనే సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని మరోసారి కోరారు. మరోవైపు సిట్ ఇప్పటికే పలు ధపాలుగా విచారణ చేస్తోంది. బీఎల్ సంతోష్ ఇంకా సిట్ విచారణకు రాలేదు. ఆయన్ను ఎలాగైనా విచారించాలని భావిస్తోంది. ఆయన విచారణకు వస్తే కీలక విషయాలను రాబట్టవచ్చని అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ప్రత్యక్షంగా పట్టుబడిన నిందితులకు బెయిల్ రావటంతో... ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point