MLAs Poaching Case: కీలక పరిణామం .. BL సంతోష్‌కు హైకోర్టులో ఊరట
mlas poaching case updates: ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురికి నోటీసులు జారీ కాగా… బీఎల్ సంతోష్ మాత్రం విచారణ రాలేదు. అయితే ఆయన… హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
bl santhosh filed quash petition in telangana high court: ఎమ్మెల్యేల ఎర కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటున్నాయి. సిట్ నోటీసుల విషయంలో హైకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. బీఎల్ సంతోష్ కు మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా అయినా నోటీసులు పంపాలని సిట్ కు కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు సిట్ కూడా విచారణను ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం… సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది.

సిట్ నోటీసులపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సంతోష్‌ను అరెస్టు చేయొద్దని సిట్ అధికారులను ఆదేశిస్తూ.. సంతోష్ విచారణకు సహకరించాలని పేర్కొంది. అయితే, సిట్ పేర్కొన్న తేదీల్లో సంతోష్ విచారణకు హాజరుకాలేకపోయారు. హాజరుకాలేకపోవడానికి గల వివరాలను సైతం ఇవాళ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌లో సంతోష్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ కేసు వ్యవహారంలో సంతోష్ కు ఎలాంటి సంబంధంలేదని.. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
మరోవైపు ఇదే కేసులో ఎంపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా సిట్ నోటీసులు అందాయి. ఈ విషయాన్ని స్వయంగా రఘురామ ధ్రువీకరించారు. ఢిల్లీలోని తన నివాసంలో సిట్ నోటీసులు అందజేశారని పేర్కొన్నారు.ఈ కేసుకు సంబంధించి ఈనెల 29న బంజారాహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సూచించినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో నోటీసులు అందుకున్న మరో ఇద్దరు సిట్ ముందుకొచ్చారు. న్యాయవాది ప్రతాప్‌గౌడ్‌తో పాటు నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ విచారణకు వచ్చారు. నందకుమార్ ఆర్థిక లావాదేవీలపై చిత్రలేఖను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.