MLAs Poaching Case: BL సంతోష్ విషయంలో సిట్ ఏం చేయబోతుంది..?-what is the sit going to do about high court s stay on bl santhosh notices case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  What Is The Sit Going To Do About High Court's Stay On Bl Santhosh Notices Case

MLAs Poaching Case: BL సంతోష్ విషయంలో సిట్ ఏం చేయబోతుంది..?

HT Telugu Desk HT Telugu
Nov 26, 2022 04:00 PM IST

BL Santosh SIT Notices Issue: ఎమ్మెల్యేల ఎర కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బీఎల్ సంతోష్ సిట్ నోటీసులపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో… తర్వాత ఏం జరగబోతుందనేది చర్చనీయాంశంగా మారింది.

సిట్ ఏం చేయబోతుంది...
సిట్ ఏం చేయబోతుంది...

SIT Notice to BL Santosh: ఎమ్మెల్యేల ఎర కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. సిట్ నోటీసుల విషయంలో హైకోర్టులో విచారణ జరుగుతూనే ఉంది. బీఎల్ సంతోష్ కు మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా అయినా నోటీసులు పంపాలని సిట్ కు కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు సిట్ కూడా విచారణను ముమ్మరం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఎల్ సంతోష్ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసు రద్దు చేయాలని లంచ్ మోషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం… సిట్‌ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కి వాయిదా వేసింది. మరోవైపు సిట్ మాత్రం దర్యాప్తును ముమ్మరం చేస్తూ వస్తోంది. పలువురిని ప్రతిరోజూ విచారిస్తోంది. ఈ క్రమంలో బీఎల్ సంతోష్ విషయంలో ఏం చేయబోతుందనేది ఇంట్రెస్టింగ్ మారింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తో కూడిన సిట్ చేయగా... ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో కీలక సమాచారం రాబట్టిన సిట్ మరికొందరికి నోటీసులు ఇచ్చింది. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్, నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేట లాయర్ ప్రతాప్ గౌడ్ ఉన్నారు. తాజాగా ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు కూడా నోటీసులు పంపించింది. దాదాపు ఈ కేసులో నోటీసులు అందుకున్న వారు స్పందించగా... బీఎల్ సంతోష్ మాత్రం స్పందించలేదు. పైగా విచారణకు కూడా హాజరుకాలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా... ఆయన హైకోర్టును ఆశ్రయించటంతో సీన్ మారిపోయింది. అరెస్ట్ తప్పదు అనుకున్న క్రమంలో... హైకోర్టు సిట్ నోటీసుపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఫలితంగా ఆయనకు బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయింది. తదుపరి విచారణ డిసెంబర్ 5న ఉంది. ఈ క్రమంలో.... తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది చర్చ జరుగుతోంది.

మరోవైపు బీఎల్ సంతోష్ ను ఎలాగైనా విచారించాలని సిట్ భావిస్తోంది. ఆయన విచారణ వస్తే... కీలక విషయాలు బయటికి వస్తాయని... ఆయనే కీలక సూత్రదారి అన్నట్లు చూస్తోంది. సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని కోర్టులో సిట్ తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. తాజాగా మరోసారి నోటీసులు పంపాలని హైకోర్టు సూచించిన క్రమంలో... పోలీసులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. కానీ స్టే రావటంతో.... కొత్తగా నోటీసులు ఇవ్వొచ్చా అనేదానిపై చర్చిస్తున్నట్లు సమచాారం. ఈ విషయంలో న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా..? అనే దానిని కూడా అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నోటీసులు ఇవ్వలేమని చెబితే హైకోర్టులో తదుపరి విచారణ డిసెంబర్ 5న ఉంది కాబట్టి అప్పటివరకు ఆగాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో... బీఎల్ సంతోష్ విషయంలో తదుపరి విచారణ తర్వాతనే సిట్ ముందుకెళ్తుందా..? లేక మరోసారి నోటీసులు ఇస్తుందా..? అలాకాకుండా మిగతావారినే విచారించే పనిలో ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

IPL_Entry_Point