Jodo Yatra in Telangana: తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర.. అటువైపు అడుగులు వేస్తారా?
rahul gandhi bharat jodo yatra కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్రతో బయల్దేరారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన ఈ పాదయాత్రలో భాగంగా తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. అయితే ఆయన మునుగోడు వైపు ఏమైనా వెళ్లే ఆలోచన చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే లక్ష్యంతో రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే యాత్ర తెలంగాణలోని పలు ప్రాంతాల మీదుగా కొనసాగనుంది. పాదయాత్ర రూట్‌మ్యాప్ కూడా దాదాపు ఖరారైంది. అయితే రాష్ట్రంలో మునుగోడు బైపోల్ వార్ అనివార్యమై నేపథ్యంలో... రాహుల్ ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ మొదలైంది. జోడో యాత్రను మునుగోడువైపు మళ్లిస్తారా అన్న డిస్కషన్ కూడా ఉంది.
15 రోజులు, 360 కి.మీలు
Rahul Gandhi Bharat Jodo Yatra in Telangana: ఇప్పటివరకు ఖరారైన యాత్ర షెడ్యూల్ ప్రకారం... అక్టోబర్ 24న రాహుల్ కర్ణా టకలోని రాయచూర్ నియో జకవర్గం నుంచి తెలంగాణలోని మక్తల్ నియోజక వర్గంలోకి ప్రవేశిస్తారు. మక్తల్ నియోజక వర్గంలోని కృష్ణ మండలం గుడ వల్లూరు గ్రామం వద్ద ఆయన రాష్ట్రంలోకి వస్తారు. అక్కడి నుంచి దేవరక్రద, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ముత్తంగి, సంగారెడ్డి,జోగి పేట, శంకరంపేట, మద్నూరుల మీదుగా మహా రాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్తారు. మొత్తం మీద 15 రోజుల పాటు 366 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది. 4 పార్లమెంట్ నియోజకవర్గాలను కవర్ చేస్తారని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. రాహుల్ యాత్రను విజయంతం చేసే దిశగా రాష్ట్ర నేతలు కూడా కార్యాచరణను రూపొందిస్తున్నారు.
అటువైపు ఉంటుందా...?
munugodu bypoll: రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు, బీజేపీలోకి వలసలు, మునుగోడు ఉప ఎన్నిక, అధికార టీఆర్ఎస్ ను ఓడించటం వంటి పలు అంశాలు టీ కాంగ్రెస్ కు పెద్ద సవాల్ గా మారిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ ఎమ్మెల్యే అయిన రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయటం, మునుగోడులో బైపోల్ రావటం దాదాపు ఖరారైంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నిక చావోరేవోగా మారిందనే చెప్పొచ్చు. అయితే ప్రియాంకగాంధీని రప్పించి సభ పెడతారనే వార్తలు వచ్చినప్పటికీ... రాహుల్ గాంధీ 15 రోజుల పాటు తెలంగాణలో యాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రాహుల్ ను మునుగోడు వైపు రప్పించేలా రాష్ట్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే యాత్ర రూట్ మ్యాప్ ను మళ్లించటం కష్టమని భావిస్తున్నట్లు కూడా సమాచారం. అయితే రాహుల్ రాష్ట్రంలో ఉండగానే... మునుగోడులో సభను తలపెట్టి.. రప్పించాలని చూస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది.
ఇప్పటికే క్షేత్రస్థాయిలో మోహరించిన కాంగ్రెస్ నేతలు... రాహుల్ ను రప్పించటం ద్వారా సరికొత్త జోష్ ను నింపాలని చూస్తోంది. తద్వారా అధికార టీఆర్ఎస్ తో పాటు బీజేపీకి సవాల్ విసిరాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఖరారైనట్లే యాత్ర ఉంటుందా..? లేక మునుగోడు వైపు రాహుల్ అడుగులు వేస్తారా..? సభతోనైనా ఎంట్రీ ఇస్తారా అన్నది చూడాలి..!
సంబంధిత కథనం