NGT Imposed Fine : తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. ఎన్జీటీ రూ.3800 కోట్ల ఫైన్-ngt directs telangana govt to pay 3 800 crore fine ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Ngt Directs Telangana Govt To Pay 3,800 Crore Fine

NGT Imposed Fine : తెలంగాణ ప్రభుత్వానికి షాక్.. ఎన్జీటీ రూ.3800 కోట్ల ఫైన్

తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా
తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా

National Green Tribunal : తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీగా జరిమానా విధించింది. గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయలేదని.. ఫైన్ విధించింది.

ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో గతంలో జారీచేసిన మార్గదర్శకాలు, తీర్పులు అమలు చేయలేదంటూ తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(NGT) భారీ జరిమానా విధించింది. తెలంగాణకు 3800 కోట్ల రూపాయల ఫైన్ వేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ మొత్తాన్ని రెండు నెలల్లో ప్రత్యేక అకౌంట్‌లో జమ చేయాలని చెప్పింది.వ్యర్ధాల నిర్వహణకు సత్వర చర్యలు చేపట్టి పురోగతి తెలిపాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ తెలిపింది.

మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య, వ్యర్థాల నిర్వహణ సరిగా చేయడం లేదని పర్యావరణ సురక్షా స్వచ్చంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను 2014లో ఎన్జీటీకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది.

351 నదీ పరీవాహక ప్రాంతాలు, 124 నగరాల్లో గాలి కాలుష్యం, 100 కాలుష్య కారక పారిశ్రామిక ప్రాంతాలు, అక్రమ ఇసుక మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఎన్జీటీ విచారణ చేసింది. ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి వివరణను అడిగింది.

తెలంగాణ ప్రధాన కార్యదర్శి వివరణ ఇచ్చారు. అయితే సంతృప్తి చెందని ఎన్జీటీ రూ.3800 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

WhatsApp channel