KCR : గాంధీ ఆచరణలోనే తెలంగాణ సాధించుకున్నాం - సీఎం కేసీఆర్-cm kcr inaugurated mahatma gandhi statue at secunderabad gandhi hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Cm Kcr Inaugurated Mahatma Gandhi Statue At Secunderabad Gandhi Hospital

KCR : గాంధీ ఆచరణలోనే తెలంగాణ సాధించుకున్నాం - సీఎం కేసీఆర్

HT Telugu Desk HT Telugu
Oct 02, 2022 12:57 PM IST

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సీఎం కేసీఆర్ గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ (twitter)

CM KCR Inaugurated Gandhi Statue: గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 ఫీట్ల గాంధీజీ విగ్రాహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్‌ ఎంజీరోడ్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విగ్రహావిష్కరణ అనంతరం.. ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసగించారు. ఈ సందర్భంగా గాంధీజీ కీర్తిని కొనియాడారు.

ట్రెండింగ్ వార్తలు

"గాంధీ వైద్యులు కరోనాపై యుద్ధం చేశారు. కరోనా సమయంలో విశేష సేవలందించారు. మంచి జరిగితే తప్పక ప్రశంసలు వస్తాయి. గాంధీ సిద్ధాంతం ఎప్పటికైనా సార్వజనీనం. రక్తం ఎరులై పారుతున్న సమయంలో యుద్ధం వద్దని చెప్పిన మహానాయకుడు గాంధీజీ. అలాంటి గాంధీజీ ఆచరణలోనే తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ తెలంగాణలో తీసుకువచ్చిన పల్లె, ప్రట్టణ ప్రగతికి గాంధీజీనే ప్రేరణ. శాంతి లేకపోతే జీవితం ఆటవికం అవుతుంది. ఈ మధ్య మహాత్ముడిని కించపరిచేలా మాట్లాడుతున్నారు. మరగుజ్జులు ఏనాటికి మహాత్ములు కాలేరు. ఆయన ఏం చేసిన అద్భుతం. గాంధీజీ అందించిన స్వేచ్ఛా వాయువులే నేటి స్వాతంత్య్రం. వెయ్యి ఏళ్లలో ఇంతటి మహాత్ముడు పుట్టలేదని UNO కూడా చెప్పింది" అని కేసీఆర్ గుర్తు చేశారు.

గాంధీజీని రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మ అని సంబోధించారని కేసీఆర్ గుర్తు చేశారు. మార్టిన్ లూథర్ కింగ్ నుంచి మండేలా వరకు గాంధీజీని కీర్తించారని తెలిపారు. ఓ సందర్భంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ… గాంధీ అనే వ్యక్తి ఈ భూగోళం మీద పుట్టకపోతే ఒబామా అనే వ్యక్తి అధ్యక్షుడు కాకపోవు అని వ్యాఖ్యానించారని చెప్పారు.

గాంధీ పుట్టిన దేశంలో జన్మించడం మనందరం చేసుకున్న పుణ్యమన్నారు కేసీఆర్. గాంధీజీ విశ్వజనీన సిద్ధాంతాలు ప్రతిపాదించారని... అహింస, శాంతి, ధర్మం, సేవ, త్యాగనిరతి సిద్ధాంతాలు విశ్వజనీనమని ప్రస్తావించారు. ప్రపంచంలో శాంతి ఉంటేనే మనమంతా సుఖంగా ఉంటామని... ఎన్ని ఆస్తులు ఉన్నా శాంతి లేకపోతే, జీవితం ఆటవికమని వ్యాఖ్యానించారు. ఈ మధ్య మహాత్ముడినే కించపరిచే మాటలు మనం వింటున్నామనని... ఆయనను కించపరిచే మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుందన్నారు. అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదన్నారు. గాంధీజీ ప్రతి మాట, అడుగు ఆచరణాత్మకంగా ఉండేవన్నారు కేసీఆర్. ఆయన పోరాటం చూసి ఎందరో మహనీయులు స్ఫూర్తిని పొందారని చెప్పారు.

IPL_Entry_Point

టాపిక్