Magnus Carlsen | వరల్డ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల బాలుడు-16 year old praggnanandha beat chess world champion magnus carlsen ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Magnus Carlsen | వరల్డ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల బాలుడు

Magnus Carlsen | వరల్డ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల బాలుడు

Hari Prasad S HT Telugu
Feb 21, 2022 12:36 PM IST

16 ఏళ్ల ఇండియన్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందా చెస్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ టోర్నీలో ఈ సంచలనం నమోదైంది.

చెస్ వరల్డ్ ఛాంపియన్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన ప్రజ్ఞానందా
చెస్ వరల్డ్ ఛాంపియన్ కార్ల్‌సన్‌కు షాకిచ్చిన ప్రజ్ఞానందా (Twitter)

చెన్నై: చెస్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌పై సంచలన విజయం సాధించాడు తమిళనాడుకు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌ ప్రజ్ఞానందా. ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌ ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ కాంపిటిషన్‌ 8వ రౌండ్‌లో కార్ల్‌సన్‌ను ఓడించాడు ప్రజ్ఞానందా. 

టోర్నీలో పాల్గొంటున్న యంగెస్ట్ ప్లేయర్‌ ఇతడే కావడం మరో విశేషం. వరుసగా మూడు విజయాలతో ఊపు మీదున్న కార్ల్‌సన్‌కు ఊహించని షాకిచ్చాడు. ప్రజ్ఞానందాకు కార్ల్‌సన్‌పై అన్ని ఫార్మాట్ల చెస్‌లోనూ ఇదే తొలి విజయం. వరుసగా మూడు ఓటముల తర్వాత ప్రజ్ఞానందా ఈ విజయం సాధించడం గమనార్హం. 

అతని పూర్తి పేరు రమేష్‌బాబు ప్రజ్ఞానందా. గ్రాండ్‌మాస్టర్‌ హోదా పొందిన ఐదో అత్యంత చిన్న వయసు చెస్‌ ప్లేయర్‌గా గతంలో అతని పేరిట రికార్డు ఉంది. 2013లో అండర్‌-8 వరల్డ్‌ యూత్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్స్‌ టైటిల్‌ గెలిచాడు. చెస్‌ చరిత్రలో యంగెస్ట్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ రికార్డు కూడా ప్రజ్ఞానందా పేరిటే ఉంది. 2016లో పదేళ్ల పది నెలల 19 రోజుల వయసులో ఈ రికార్డును అతను సాధించాడు.

WhatsApp channel