శనీశ్వరుడి ఎఫెక్ట్ కొత్త ఏడాది ఈ రాశుల వారికి కష్టాలే-lord shani effect these zodiacs will face crucial problems in 2024 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Lord Shani Effect These Zodiacs Will Face Crucial Problems In 2024

శనీశ్వరుడి ఎఫెక్ట్ కొత్త ఏడాది ఈ రాశుల వారికి కష్టాలే

Gunti Soundarya HT Telugu
Dec 07, 2023 06:33 PM IST

Lord shani effect: శనీశ్వరుడు కొత్త ఏడాది కొన్ని రాశుల వారికి దురదృష్టం తీసుకురాబోతున్నాడు. శని ఆగ్రహం నుంచి తప్పించుకోవాలంటే ఈ తప్పులు చేయకుండా ఉండటమే మంచిది.

ఈ రాశులపై శనీశ్వరుడి ప్రభావం అధికం
ఈ రాశులపై శనీశ్వరుడి ప్రభావం అధికం (wikipedia)

శని దేవుడు అంటే అందరికీ భయమే. శని స్థానబలం శుభప్రదంగా ఉంటే అదృష్టం వరిస్తుంది. కానీ కన్నెర్ర చేస్తే మాత్రం కష్టాల నుంచి తప్పించుకోవడం వీలు కాదు. మంచి పనులు చేస్తే ఊహించని విధంగా ధనవంతులని చేస్తాడు. చెడు పనులు చేస్తే వారికి ఊహించని కష్టాలు ఇస్తాడు.

ట్రెండింగ్ వార్తలు

శని దేవుడికి ఆగ్రహం కలగకుండా ఉండాలంటే శనివారం పూజ చేస్తే మంచి జరుగుతుంది. శనీశ్వరుడు ముందుగా కష్టాలు ఇచ్చినా తర్వాత అద్భుతమైన మేలు కలుగజేస్తాడు. ఎవరి కర్మలని అనుసరించి వారికి తగిన విధంగా శని ఫలితాలు ఇస్తాడు. కొన్ని రాశుల వారికి శని దేవుడు చుక్కలు చూపించబోతున్నాడు. 2024 సంవత్సరంలో ఈ ఐదు రాశుల వారిని కష్టాలు ఎక్కువగా ఎదుర్కోబోతున్నారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారిపై ఈ ఏడాది మాత్రమే కాదు 2024 సంవత్సరం చివర వరకు కూడా శనీశ్వరుడి ప్రభావం ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. తప్పులు చేసి శనీశ్వరుడి ఆగ్రహం పొందకుండా ఉండేందుకు వీలైనంత వరకు ప్రయత్నించాలి. ఎటువంటి ప్రమాదరకమైన పని చేయకూడదు. ఒక్కోసారి తీసుకునే ఆకస్మిక నిర్ణయాలు చిక్కుల్లో పడేస్తాయి. వ్యాపారాలు చేపట్టాలని చూసే వాళ్ళు ప్రయత్నం విరమించుకోవడం మంచిది.

వృశ్చిక రాశి

ఈ రాశి వారిపై శని గ్రహ ప్రభావం బాగా ఉంటుంది. వాహనాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. డ్రైవింగ్ కు దూరంగా ఉండటం మంచిది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి

కొత్త ఏడాది చివరి వరకు శని ప్రభావం మకర రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. శనీశ్వరుడి ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేయాలి. ఎటువంటి ఫలితం ఆశించకుండా దాన ధర్మాలు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల కొన్ని కర్మల నుంచి విముక్తి లభిస్తుంది. ఎవరైనా సహాయం కోరి వస్తే వెనుకాడకుండా సాయం చేసేందుకు ప్రయత్నించండి. దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. శనీశ్వరుడి ఆగ్రహం కాస్త తగ్గుతుంది.

కుంభ రాశి

శని దేవుడు కుంభ రాశికి అధిపతి. ఈ రాశి వాళ్ళు 2024లో శనీశ్వరుడు ఆధీనంలో ఉంటారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం శని స్తోత్రాన్ని పఠించాలి. గొడవలకు ఎంత ఎక్కువ దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోకూడదు.

మీనరాశి

ఏడున్నర శని మీన రాశికి రెండో మొదటి దశ. దీని వల్ల 2024 ఏడాది మొత్తం శని ప్రభావాన్ని ఎదుర్కొంటారు. అనేక సమస్యలు చుట్టుముడతాయి. ఈ ఏడాది మొత్తం మాటలు చాలా జాగ్రత్తగా వాడాలి. లేదంటే సొంత వాళ్ళ మధ్య కూడా పొరపొచ్చాలు రావచ్చు. కుదిరినన్ని దాన ధర్నాలు చేయాలి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టె అవకాశం ఎక్కువగా ఉంది.

WhatsApp channel

2024 సంవత్సర రాశి ఫలాలు

నూతన సంవత్సర రాశి ఫలాలు, పండగలు, శుభాకాంక్షలు ఇంకా మరెన్నో ఇక్కడ చదవండి.