మరో వారం పాటు ఈ రాశుల వారికి గుడ్‍ టైమ్.. కార్య సిద్ధి, ఆర్థిక ప్రయోజనాలు!-venus transiting in mula nakshatra these zodiac signs may get great luck and benefits another week ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరో వారం పాటు ఈ రాశుల వారికి గుడ్‍ టైమ్.. కార్య సిద్ధి, ఆర్థిక ప్రయోజనాలు!

మరో వారం పాటు ఈ రాశుల వారికి గుడ్‍ టైమ్.. కార్య సిద్ధి, ఆర్థిక ప్రయోజనాలు!

Nov 11, 2024, 01:14 PM IST Chatakonda Krishna Prakash
Nov 11, 2024, 12:58 PM , IST

  • మూలా నక్షత్రంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. దీనివల్ల మూడు రాశుల వారికి అదృష్టం ఇంకో వారం బాగా ఉండనుంది. గుడ్ టైమ్ ఉంటుంది. వివరాలివే..

జ్యోతిష శాస్త్రంలో శుక్రుడికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే శుక్రుడి సంచారంతో రాశుల అదృష్టాలు మారుతూ ఉంటాయి. శుక్రుడు ఇటీవలే మూలా నక్షత్రంలో అడుగుపెట్టాడు. 

(1 / 5)

శుక్రుడు మరో వారం రోజులు అంటే నవంబర్ 18వ తేదీ వరకు కేతువుకు చెందిన మూలా నక్షత్రంలోనే ఉంటాడు. గత గురువారం మూలా నక్షత్రంలో ప్రవేశించిన శుక్రుడు నవంబర్ 18వ అదే నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో ఈ ఏడు రోజులు కొన్ని రాశులకు అదృష్టం ఎక్కువగా ఉంటుంది. 

(2 / 5)

శుక్రుడు మరో వారం రోజులు అంటే నవంబర్ 18వ తేదీ వరకు కేతువుకు చెందిన మూలా నక్షత్రంలోనే ఉంటాడు. గత గురువారం మూలా నక్షత్రంలో ప్రవేశించిన శుక్రుడు నవంబర్ 18వ అదే నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో ఈ ఏడు రోజులు కొన్ని రాశులకు అదృష్టం ఎక్కువగా ఉంటుంది. (Unsplash)

కన్య: ఈ కాలంలో కన్యా రాశి వారికి అదృష్టం ఉంటుంది. మూలా నక్షత్రంలో శుక్రుడి సంచారంతో వీరికి మరో వారం పాటు కలిసి రానుంది. వ్యాపారం చేస్తున్న వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారికి సత్ఫలితాలు ఉండొచ్చు. కుటుంబంతో సమయం సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. తలపెట్టే చాలా పనుల్లో విజయం సిద్ధిస్తుంది. 

(3 / 5)

మకరం: ఈ కాలంలో మకర రాశి వారికి ప్రయోజనాలు కలుగుతాయి. చాలా కాలంగా కొనసాగుతున్న కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు వృద్ధి ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు డబ్బు ఎక్కువగా రావొచ్చు. వాయిదా పడుతున్న కొన్ని పనులను పూర్తి చేస్తారు. వివిధ మార్గాల ద్వారా ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి.  

(4 / 5)

కుంభం: మూలా రాశిలో శుక్రుడు సంచరించే మరో వారం పాటు కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లాభాలు బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. పొదుపు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారు. కుటుంబం నుంచి మద్దతు పెరుగుతుంది. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు