తెలుగు న్యూస్ / ఫోటో /
Travel wishlist: ఈ నెలలో వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ లిస్ట్ మీ కోసమే..
Travel wishlist: అక్టోబర్ నెలలో, ముఖ్యంగా దసరా సెలవుల్లో చాలా మంది ఏదో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. వారి కోసమే ఈ లిస్ట్. భారత దేశంలో ఈ అక్టోబర్ నెలలో పర్యటించాల్సిన ప్రదేశాల లిస్ట్ ఇది..
(1 / 8)
ఈ నెలలో వెకేషన్ కు ప్లాన్ చేస్తే, ఈ ప్రదేశాల్లో ఏదో ఒకదానిని మీ ట్రావెల్ ప్లాన్ లో భాగం చేసుకోండి. మీ ట్రిప్ మెమొరబుల్ గా ఉంటుంది.(Unsplash)
(2 / 8)
కశ్మీర్: భారత్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పైన మంచు పర్వతాలు, కింద ఆకుపచ్చని లోయలతో భూతల స్వర్గంగా పేరున్న కశ్మర్ ను అక్టోబర్ నెలలో చూడవచ్చు. (Pixabay)
(3 / 8)
హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న కాంగ్రా లోయలో ఉన్న చిన్న గ్రామం బిర్ బిలింగ్. ఇది అక్టోబర్ లో కచ్చితంగా చూడాల్సిన పర్యాటక ప్రదేశం. పారా గ్లైడింగ్ ఇక్కడ చాలా ఫేమస్. అది అక్టోబర్ నెలలోనే ప్రారంభమవుతుందిద. (Unsplash)
(4 / 8)
రిషికేష్: అక్టోబర్ నెలలో ప్లాన్ చేసుకోవాల్సి ఆధ్యాత్మిక, అడ్వెంచరస్ టూర్ రిషికేష్. ఇక్కడ క్యాంపింగ్, ట్రెకింగ్, రివర్ రాఫ్టింగ్ వంటివి కచ్చితంగా ఎక్స్ పీరియన్స్ చేయాల్సినవి. రిషికేష్ ను యోగా క్యాపిటల్ అని కూడా అంటారు.(pixabay)
(5 / 8)
షిల్లాంగ్: బ్రిటిషర్లు దీనిని స్కాట్ లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అనేవారు. పైనాపిల్ తోటలు ఇక్కడ ఫేమస్. ఇది సముద్ర మట్టానికి 1491 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈశాన్య రాష్ట్రం మేఘాలయ రాజధాని ఇది.(Unsplash)
(6 / 8)
కేరళ: అక్టోబర్ నెలలో పర్యటించడానికి అనువైన ప్రదేశాల్లో కేరళ కూడా ఒకటి. బ్యాక్ వాటర్స్ లో హౌజ్ బోట్ లో గడపడం మరచిపోలేని అనుభూతిగా మిగులుతుంది. మున్నార్, వాయనాడ్, కోవలం బీచ్ వంటివి కేరళలో చూడదగ్గ ప్రాంతాలు.(Unsplash)
(7 / 8)
మైసూర్: కర్నాటకలోని మైసూరులో జరిగే దసరా ఉత్సవాలను చూడడం కోసం అక్టోబర్ నెలలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, సెయింట్ ఫెలొమినా చర్చ్.. చూడాల్సిన ప్రదేశాలు. (Unsplash)
ఇతర గ్యాలరీలు