తెలుగు న్యూస్ / ఫోటో /
Bogatha Waterfalls Trip : బొగత జలపాతం పరవళ్లు చూసొద్దామా..! రూ.1600కే వన్ డే ట్రిప్ ప్యాకేజీ - పూర్తి వివరాలివే
- Telangana Tourism Bogatha Tour Package : బొగత మళ్లీ జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రకృతి అందాల మధ్య ఉండే ఈ ప్రాంతాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది.
- Telangana Tourism Bogatha Tour Package : బొగత మళ్లీ జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. ప్రకృతి అందాల మధ్య ఉండే ఈ ప్రాంతాన్ని చూసేందుకు తెలంగాణ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది.
(1 / 7)
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో బొగత జలపాతం ఉంటుంది. తెలంగాణ నయాగారాగా కూడా దీనికి పేరుకుంది. చుట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అడవి గుండా ప్రవహిస్తూ వస్తున్న జలపాతం అందాలను చూసి పర్యాటకులు మురిసిపోతుంటారు.
(2 / 7)
మొన్నటి వరకు ఎండల తీవ్రత ఉండగా.. నీటి ప్రవాహం పెద్దగా లేదు. అయితే నైరుతి రుతుపవనాల రాకతో… మళ్లీ బొగతకు నీటి ప్రవాహం క్రమంగా పెరిగింది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల దాటికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. దీంతో బొగత మళ్లీ పరవళ్లను తొక్కుతుంది.(Image Source Twitter File Photo)
(3 / 7)
సహజసిద్ధ జలపాతాన్ని చూసేందుకు నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. ఇప్పుడిప్పుడే వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. రాబోయే రోజుల్లో వచ్చే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.(Image Source TS Tourism Website)
(4 / 7)
ఇలాంటి ప్లేస్ ను చూసేందుకు తెలంగాణ టూరిజం వన్ డే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తోంది. నాన్ ఏసీ కోచ్ లో జర్నీ ఉంటుంది. వీకెండ్స్ లో ఈ ప్యాకేజీని ఆపేరట్ చేస్తున్నారు. తెలంగాణ టూరిజం అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీ వివరాలను తెలుసుకోవచ్చు. బుకింగ్ కూడా చేసుకోవచ్చు,(Image Source TS Tourism Website)
(5 / 7)
BOGATHA WATERFALLS - Telangana Tourism పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. కేవలం ఒక్క రోజులోనే ఈ ట్రిప్ ముగుస్తుంది. నాన్ ఏసీ కోచ్ బస్సులో హైదరాబాద్ నుంచి బొగతకు వెళ్తారు.(Image Source Twitter File Photo)
(6 / 7)
ఈ ప్యాకేజీ షెడ్యూల్ చూస్తే…. ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లో జర్నీ ప్రారంభం అవుతుంది. రాత్రి 11.30 గంటలకు తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. ప్రతి శని, ఆదివారాల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.(Image Source Twitter File Photo)
(7 / 7)
టికెట్ ధరలు: పెద్దలు రూ. 1600, చిన్నారులు రూ. 1280 గా నిర్ణయించారు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటేhttps://tourism.telangana.gov.in/package/bogathawaterfalls ఈ డైరెక్ట్ లింక్ తో ప్రాసెస్ చేసుకోవచ్చు.(Image Source Twitter File Photo)
ఇతర గ్యాలరీలు