Hyderabad Restaurants : హైదరాబాద్ లోని ఈ రెస్టారెంట్లలో తింటున్నారా? జర జాగ్రత్త!-telangana food safety officer checking in hyderabad restaurants identify expired products ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Restaurants : హైదరాబాద్ లోని ఈ రెస్టారెంట్లలో తింటున్నారా? జర జాగ్రత్త!

Hyderabad Restaurants : హైదరాబాద్ లోని ఈ రెస్టారెంట్లలో తింటున్నారా? జర జాగ్రత్త!

May 22, 2024, 09:34 PM IST Bandaru Satyaprasad
May 22, 2024, 09:34 PM , IST

  • Hyderabad Restaurants : హైదరాబాద్ రెస్టారెంట్లకు వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి. ఫుడ్ తో పాటు చికెన్, వారు వాడే పదార్థాలు సరైనవేనా అని తెలుసుకోండి. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్ దృశ్యాలు కనిపించాయి.

చేతిలో సెల్ ఫోన్, ఫోన్ నిండా ఫుడ్ యాప్స్...క్షణాల్లో ఇంటికి ఫుడ్. ఇంట్లో ఏం తింటాం రెస్టారెంట్ కు పోదాం. నచ్చిన ఫుడ్ తినొచ్చు. ఈ ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. అయితే ఈ ఫొటోలు చూస్తే రెస్టారెంట్ పేరు ఎత్తితే ఒకసారి ఆలోచించాల్సిందే. మీరు ఇష్టపడి తినే కృతుంగా, కేఎఫ్సీ, మాస్టర్ చెఫ్ వంటి ఫేమస్ రెస్టారెంట్లలోనే ఎంత అపరిశుభ్ర పదార్థాలు వినియోగిస్తున్నారో తెలుసుకోవాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటున్నారు.

(1 / 6)

తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ హైదరాబాద్‌లోని సోమాజిగూడ, ఉప్పల్ లోని మూడు ప్రముఖ రెస్టారెంట్లలో గత రెండు రోజులుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్లలో నిల్వ ఉంచిన పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన పదార్థాలు గుర్తించారు. 

(2 / 6)

సోమాజిగూడ కృతుంగ రెస్టారెంట్ లో ఎక్స్పైరీ తేదీ ముగిసిన పదార్థాలు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిని ధ్వంసం చేశారు.  కృతుంగ పాలెగార్ బ్రాండ్ వాటర్ బాటిళ్లను గుర్తించారు. వీటిని TDS మీటర్ తో పరిశీలిస్తే 4 ppm కలిగి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి నమూనాలను ల్యాబ్ కు పంపారు.

(3 / 6)

గడువు ముగిసిన పాలు, సింథటిక్ రంగులను ఉపయోగించిన పదార్థాలు, నిబంధనలు ఉల్లంఘించి నిల్వచేసిన పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రెస్టారెంట్లలో గుర్తించారు. వినియోగదారులు ఈ రెస్టారెంట్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. 

(4 / 6)

సోమవారం మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ లో తనిఖీలు చేసిన అధికారులు ... సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగించిన ఆహార పదార్థాలను గుర్తించారు.  వాటిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. గడువు ముగిసిన మిల్క్ ప్యాకెట్లు, లేబుల్ లేని అల్లం వెల్లుల్లి పేస్ట్, బేకరీ వస్తువులు గుర్తించి వాటిని పడేశారు. 

(5 / 6)

అపరిశుభ్రమైన స్థితిలో రిఫ్రిజిరేటర్, హెయిర్‌క్యాప్‌లు, గ్లోవ్‌లు, అప్రాన్‌లు, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేకుండా ఫుడ్ హ్యాండ్లర్లు ఈ రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు