తెలుగు న్యూస్ / ఫోటో /
SCR Summer Special Trains : ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ - రూట్ల వివరాలివే
- South Central Railway Special Trains 2024 : సమ్మర్ లో రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ నెల మధ్యలో ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి. ఈ వివరాలను ఇక్కడ చూడండి......
- South Central Railway Special Trains 2024 : సమ్మర్ లో రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి వేసవి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ నెల మధ్యలో ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి. ఈ వివరాలను ఇక్కడ చూడండి......
(1 / 7)
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కీలక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. (Photo Source From unsplash.com)
(2 / 7)
సికింద్రాబాద్ నుంచి సాంత్రాగాఛి, షాలిమార్ ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.(Photo Source From unsplash.com)
(3 / 7)
సికింద్రాబాద్-సాంత్రాగాఛి(07223) రైలు ప్రతి శుక్రవారం బయల్దేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 28 వరకు ఈ ట్రైన్ సేవలు ఉంటాయి. మొత్తం 11 ట్రిప్పులు నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.(Photo Source From unsplash.com)
(4 / 7)
ప్రతి శనివారంసాంత్రాగాఛి నుంచి సికింద్రాబాద్(07224)కు ప్రత్యేక రైలు ఉంటుంది. ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. (Photo Source From unsplash.com)
(5 / 7)
ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్… తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్లలో ఆగుతాయి. తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడతో పాటు ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా ఈ సేవలు కొనసాగుతాయి.(Photo Source From unsplash.com)
(6 / 7)
మరోవైపు సికింద్రాబాద్-షాలిమార్(07225) మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది రైల్వేశాఖ. ఏప్రిల్ 15 నుంచి జూన్ 24 వరకు ఈ సేవలు కొనసాగుతాయి.(Photo Source From unsplash.com)
(7 / 7)
ఇక ప్రతి సోమవారం షాలిమార్-సికింద్రాబాద్(07226) మధ్య మరోక్క స్పెషల్ ట్రైన్ సేవలు అందించనుంది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం బయల్దేరుతాయి. ఈ రైళ్లు కూడా 11 ట్రిప్పులు తిరుగుతాయి. ఈ ట్రైన్స్,,,, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం స్టేషన్లలో ఆగుతాయి. https://scr.indianrailways.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.(Photo Source From unsplash.com)
ఇతర గ్యాలరీలు