
(1 / 5)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ కోసం దక్షిణాఫ్రికా యంగ్ పేసర్ క్వెనా మఫకాను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తీసుకుంది. అండర్ 19 ప్రపంచకప్‍లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఈ 17ఏళ్ల ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేసుకుంది.
(Mumbai Indians)
(2 / 5)
శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ సీజన్‍కు ముంబై ఇండియన్స్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతడికి రిప్లేస్‍మెంట్‍గా మఫకాను ముంబై తీసుకుంది.
(AFP)
(3 / 5)
ఈ ఏడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్‍లో క్వెనా మఫకా అద్భుతంగా బౌలింగ్ చేసి ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. ఒక అండర్ 19 ప్రపంచకప్ ఎడిషన్‍లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా రికార్డు సృష్టించాడు.
(ICC)
(4 / 5)
అండర్-19 ప్రపంచకప్‍లో ముఖ్యంగా డెత్ ఓవర్లలో క్వెనా మఫకా బౌలింగ్ అదరగొట్టాడు. యార్కర్లతో దుమ్మురేపాడు. దీంతో ఈ దక్షిణాఫ్రికా అన్‍క్యాప్ ఫాస్ట్ బౌలర్‌ను జట్టులోకి తీసుకుంది ముంబై ఫ్రాంచైజీ. క్వెనా మఫకాను రూ.50లక్షల బేస్ ప్రైజ్‍తో ముంబై ఇండియన్స్ తీసుకుంది.

(5 / 5)
ఐపీఎల్ 2024 టోర్నీ మార్చి 22వ తేదీన మొదలుకానుంది. ఈ సీజన్‍లో తొలి మ్యాచ్‍ను మార్చి 23వ తేదీన గుజరాత్ టైటాన్స్ జట్టుతో ముంబై ఆడనుంది. ఈ సీజన్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించింది ముంబై ఫ్రాంచైజీ.
(PTI)ఇతర గ్యాలరీలు