Lucky Zodiac Signs: నేటి నుంచి ఏడు రోజులు ఈ మూడు రాశుల వారికి గుడ్‍టైమ్!
Lucky Zodiac Signs: సింహ రాశిలో బుధుడు, సూర్యుడు కలవటంతో నేడు (ఆగస్టు 16) బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. దీని వల్ల కొన్ని రాశుల వారికి చాలా విషయాల్లో మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి.
(1 / 5)
గ్రహాల సంచారాల కారణంగా ఏర్పడే యోగాలు రాశులపై ప్రభావాన్ని చూపుతాయి. నేడు (ఆగస్టు 16) సింహ రాశిలోకి సూర్యడు ప్రవేశించాడు. ఇప్పటికే ఆ రాశిలో బుధుడు ఉన్నాడు.
(2 / 5)
సింహరాశిలో సూర్యుడు, బుధుడి కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఆగస్టు 22వ తేదీ వరకు సింహరాశిలోనే బుధుడు ఉంటాడు. దీంతో నేటి (ఆగస్టు 16) నుంచి ఆగస్టు 22 ఉదయం వరకు సింహ రాశిలో ఈ యోగం ఉండనుంది. దీంతో రానున్న ఏడు రోజుల కాలం కొన్ని రాశుల వారికి బాగా కలిసి రానుంది.
(3 / 5)
తులా: బుధాదిత్య రాజయోగం కాలంలో తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా లాభాలు చేకూరే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి. డబ్బును ఎక్కువగా ఆదా చేస్తారు. ఆత్మవిశ్వాసం కూడా మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
(4 / 5)
సింహం: ఈ రాశిలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. దీంతో ఈ కాలంలో సింహ రాశి వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యాపారులకు లాభాలు పెరిగే ఛాన్స్ ఉంది. వ్యాపారాన్ని విస్తరించొచ్చు.
(5 / 5)
మేషం: బుధాదిత్య రాజయోగం కాలం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. చేసే పనుల్లో అధిక శాతం విజయవంతం అవుతాయి. శుభవార్తలు వింటారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బు పెట్టుబడి పెట్టేందుకు అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఈ కాలంలో లక్ష్మి కటాక్షం ఈ రాశి వారిపై ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి, అదనపు వివరాల కోసం సంబంధిత నిపుణుడిని సంప్రదించాలి.)
ఇతర గ్యాలరీలు