AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీకి వర్ష సూచన, తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు-low pressure forms over bay of bengal imd predicts heavy rainfall for next two days in ap and telangana ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ap Tg Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీకి వర్ష సూచన, తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఏపీకి వర్ష సూచన, తెలంగాణలోని ఈ జిల్లాలకు హెచ్చరికలు

Jun 29, 2024, 07:35 AM IST Maheshwaram Mahendra Chary
Jun 29, 2024, 07:35 AM , IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో మరో మూడు నాలుగు రోజులు వానలు పడే అవకాశం ఉంది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉత్తర ఒడిశా తీరంలో వాయువ్వ బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అనుబంధ తుఫాన్ ప్రసరణ సగటు సముద్ర మట్టానికి 5 .5 కి.మీ వరకు విస్తరించి ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఇది వాయువ్వ దిశగా కదిలించే అవకాశం ఉంది.

(1 / 6)

ఉత్తర ఒడిశా తీరంలో వాయువ్వ బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. అనుబంధ తుఫాన్ ప్రసరణ సగటు సముద్ర మట్టానికి 5 .5 కి.మీ వరకు విస్తరించి ఉందని పేర్కొంది. రానున్న 2 రోజుల్లో ఇది వాయువ్వ దిశగా కదిలించే అవకాశం ఉంది.(image source unsplash.com)

రుతుపవనాల విస్తరణతో పాటు అల్పపీడన ప్రభావంతో మూడు నాలుగురోజులు ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.

(2 / 6)

రుతుపవనాల విస్తరణతో పాటు అల్పపీడన ప్రభావంతో మూడు నాలుగురోజులు ఏపీ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.

ఇవాళ(జూన్ 29) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(3 / 6)

ఇవాళ(జూన్ 29) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.(image source unsplash.com)

 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది..

(4 / 6)

 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది..(image source unsplash.com)

ఆదివారం(జూన్ 30) అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

(5 / 6)

ఇవాళ తెలంగాణలోని కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు