TS Weather Updates : ఐఎండీ చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తెలంగాణలో వర్షాలు..!-light rains likely after may 6 in some parts of telangana imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ts Weather Updates : ఐఎండీ చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తెలంగాణలో వర్షాలు..!

TS Weather Updates : ఐఎండీ చల్లని కబురు - ఆ తేదీ తర్వాత తెలంగాణలో వర్షాలు..!

May 02, 2024, 02:47 PM IST Maheshwaram Mahendra Chary
May 02, 2024, 02:47 PM , IST

  • Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతల దాటికి జనం అల్లాడిపోతున్నారు. అయితే తెలంగాణకు ఉపశమనం కలిగించే న్యూస్ చెప్పింది ఐఎండీ. మే 6వ తేదీ నుంచి తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వెదర్ రిపోర్ట్ వివరాలను ఇక్కడ చూడండి..
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో కొద్దిరోజులుగా ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. 45 డిగ్రీలు దాటిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

(1 / 7)

ఏపీ, తెలంగాణలో కొద్దిరోజులుగా ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. 45 డిగ్రీలు దాటిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

భానుడి ఉగ్రరూపంతో బయటికి వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నాయి. ఉదయం 10 దాటకముందే పనులు చూసుకుంటున్నారు. మళ్లీ సూర్యుడి ప్రతాపం తగ్గిన తర్వాతే…. బయటికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. 

(2 / 7)

భానుడి ఉగ్రరూపంతో బయటికి వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నాయి. ఉదయం 10 దాటకముందే పనులు చూసుకుంటున్నారు. మళ్లీ సూర్యుడి ప్రతాపం తగ్గిన తర్వాతే…. బయటికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. (Photo Source From unsplash.com)

తెలంగాణలో ఇవాళ్టి నుంచి మే 5వ తేదీ వరకు చాలా జిల్లాల్లో దీర్ఘకాలిక వడగాల్పులు వీచే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 

(3 / 7)

తెలంగాణలో ఇవాళ్టి నుంచి మే 5వ తేదీ వరకు చాలా జిల్లాల్లో దీర్ఘకాలిక వడగాల్పులు వీచే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. (Photo Source From unsplash.com)

ఇదే సమయంలో తెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఐఎండీ చల్లని కబురు చెప్పింది. మే 5వ తేదీ తర్వాత రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

(4 / 7)

ఇదే సమయంలో తెలంగాణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఐఎండీ చల్లని కబురు చెప్పింది. మే 5వ తేదీ తర్వాత రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.(Photo Source From unsplash.com)

మే 6వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

(5 / 7)

మే 6వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.(Photo Source From unsplash.com)

మే 7వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోఅక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 

(6 / 7)

మే 7వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోఅక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. (Photo Source From unsplash.com)

మే 8వ తేదీన తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

(7 / 7)

మే 8వ తేదీన తెలంగాణలోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.(Photo Source From unsplash.com)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు