Pet Parents | పెంపుడు జంతువును పెంచుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..-important things you must know as a first pet parent ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pet Parents | పెంపుడు జంతువును పెంచుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

Pet Parents | పెంపుడు జంతువును పెంచుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..

Mar 11, 2022, 02:43 PM IST Geddam Vijaya Madhuri
Mar 11, 2022, 02:43 PM , IST

  • ఈ రోజుల్లో పెంపుడు జంతువులను పెంచుకునే వారు ఎక్కువయ్యారు. ప్రేమగా మూగజీవాలను ఆదరిస్తున్నారు. మీరు కూడా పెంపుడు జంతువును పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే పెంపుడు జంతువుకి, మీ కుటుంబ సభ్యులకు మధ్య  సంబంధం సాఫీగా సాగాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు. 

కుక్కను పెంచుకోవాలి అనే వారికి కొన్ని అలవాటు పడటానికి సమయం పడుతుంది. దానికి పెట్టే ఆహారం, టీకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెంపుడు జంతువును దత్తత తీసుకున్నప్పుడు కొన్ని రోజులు మీరు వాటికి కంఫెర్ట్ ఇవ్వాలి. దీని కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను గుర్తుంచుకోవాలి అంటున్నారు సీనియర్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అజయ్ సత్​బిగే.

(1 / 6)

కుక్కను పెంచుకోవాలి అనే వారికి కొన్ని అలవాటు పడటానికి సమయం పడుతుంది. దానికి పెట్టే ఆహారం, టీకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెంపుడు జంతువును దత్తత తీసుకున్నప్పుడు కొన్ని రోజులు మీరు వాటికి కంఫెర్ట్ ఇవ్వాలి. దీని కోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను గుర్తుంచుకోవాలి అంటున్నారు సీనియర్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అజయ్ సత్​బిగే.(Pixabay)

పెంపుడు తల్లిదండ్రులుగా మారడానికి ముందు మీరు ఇంటికి తీసుకురావాలనుకుంటున్న కుక్క జాతిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముందు పెంపుడు జంతువు జాతి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దాని ఆహారపు అలవాట్లను అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వాటికి కావాల్సిన పోషక అవసరాలు, వారి జాతి, పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలు అలెర్జీలు, ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ ఆహారం, ట్రీట్‌లను తినిపించే ముందు పశువైద్యుడిని సంప్రదించండి.

(2 / 6)

పెంపుడు తల్లిదండ్రులుగా మారడానికి ముందు మీరు ఇంటికి తీసుకురావాలనుకుంటున్న కుక్క జాతిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ముందు పెంపుడు జంతువు జాతి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. దాని ఆహారపు అలవాట్లను అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వాటికి కావాల్సిన పోషక అవసరాలు, వారి జాతి, పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలు అలెర్జీలు, ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ ఆహారం, ట్రీట్‌లను తినిపించే ముందు పశువైద్యుడిని సంప్రదించండి.(Pixabay)

మీ పెంపుడు జంతువు యొక్క జాతి, కుటుంబ చరిత్ర, యాజమాన్యం, చట్టపరమైన దత్తత, పెంపకం, టీకాలు, డీవార్మింగ్ షెడ్యూల్ ఇవన్నీపెంపుడు జంతువుల తల్లిదండ్రులకు తెలియాలి. ఎందుకంటే ఇది మీ పెంపుడు జంతువులను తెలుసుకోవడానికి.. వాటి జన్యు చరిత్రను బాగా అర్థం చేసుకోవడానికి పశువైద్యులకు బాగా ఉపయోగపడుతుంది.

(3 / 6)

మీ పెంపుడు జంతువు యొక్క జాతి, కుటుంబ చరిత్ర, యాజమాన్యం, చట్టపరమైన దత్తత, పెంపకం, టీకాలు, డీవార్మింగ్ షెడ్యూల్ ఇవన్నీపెంపుడు జంతువుల తల్లిదండ్రులకు తెలియాలి. ఎందుకంటే ఇది మీ పెంపుడు జంతువులను తెలుసుకోవడానికి.. వాటి జన్యు చరిత్రను బాగా అర్థం చేసుకోవడానికి పశువైద్యులకు బాగా ఉపయోగపడుతుంది.(Pixabay)

ఇంటికి దగ్గరగా ఉన్న వెటర్నరీ క్లినిక్‌ని ఎంచుకోండి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో పశువైద్యుడు మీ ఇంటికి రావచ్చు. లేదా మీరే ఆస్పత్రికి తీసుకువెళ్లవచ్చు. మీ పెంపుడు జంతువులు వచ్చే అనారోగ్యాలు, వ్యాధులు లేదా ఆరోగ్య పరిస్థితుల నుంచి కాపాడేలా..  రెగ్యులర్ చెకప్‌లు, టీకాలు వేయించవచ్చు. నులిపురుగుల నిర్మూలన చేయడం చాలా ముఖ్యం. కాల్ సర్వీస్‌లో గ్రూమర్ మీ పెంపుడు జంతువు గోళ్లను కత్తిరించడం లేదా స్నానం చేయించడం కోసం కూడా మంచిది. మీ పెంపుడు జంతువులకు శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీకు.. పెంపుడు జంతువుకు మధ్య ప్రత్యేకమైన బంధాన్ని సృష్టిస్తుంది.

(4 / 6)

ఇంటికి దగ్గరగా ఉన్న వెటర్నరీ క్లినిక్‌ని ఎంచుకోండి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో పశువైద్యుడు మీ ఇంటికి రావచ్చు. లేదా మీరే ఆస్పత్రికి తీసుకువెళ్లవచ్చు. మీ పెంపుడు జంతువులు వచ్చే అనారోగ్యాలు, వ్యాధులు లేదా ఆరోగ్య పరిస్థితుల నుంచి కాపాడేలా..  రెగ్యులర్ చెకప్‌లు, టీకాలు వేయించవచ్చు. నులిపురుగుల నిర్మూలన చేయడం చాలా ముఖ్యం. కాల్ సర్వీస్‌లో గ్రూమర్ మీ పెంపుడు జంతువు గోళ్లను కత్తిరించడం లేదా స్నానం చేయించడం కోసం కూడా మంచిది. మీ పెంపుడు జంతువులకు శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీకు.. పెంపుడు జంతువుకు మధ్య ప్రత్యేకమైన బంధాన్ని సృష్టిస్తుంది.(Pixabay)

మీరు పెంపుడు జంతువుల తల్లిదండ్రుల సంఘంలో సభ్యునిగా చేరండి. తర్వాత పెంపుడు జంతువుల గురించిన కొత్త సమాచారం, ట్రెండ్‌ల గురించి తెలుసుకోండి. ఇది మిమ్మల్ని ఇతర పెంపుడు జంతువుల నిపుణులతో కూడా కనెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మీ ప్రశ్నలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇవి బలమైన బ్యాకప్‌గా పని చేస్తాయి.

(5 / 6)

మీరు పెంపుడు జంతువుల తల్లిదండ్రుల సంఘంలో సభ్యునిగా చేరండి. తర్వాత పెంపుడు జంతువుల గురించిన కొత్త సమాచారం, ట్రెండ్‌ల గురించి తెలుసుకోండి. ఇది మిమ్మల్ని ఇతర పెంపుడు జంతువుల నిపుణులతో కూడా కనెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా మీ ప్రశ్నలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇవి బలమైన బ్యాకప్‌గా పని చేస్తాయి.(Pixabay)

అనుభవజ్ఞులైన పెంపుడు జంతువులు, డాగ్ వాకర్లు, డాగ్ బోర్డింగ్‌లను ఎల్లప్పుడూ సంప్రదించండి, తద్వారా మీ పెంపుడు జంతువు బాగా సంరక్షించబడుతుంది. ఆహారం, సాధారణ సంరక్షణ, వెట్ సందర్శనలు మందులు. ఉపకరణాలు గురించి మరింత తెలుసుకునే అవకాశం ఉంటుంది. 

(6 / 6)

అనుభవజ్ఞులైన పెంపుడు జంతువులు, డాగ్ వాకర్లు, డాగ్ బోర్డింగ్‌లను ఎల్లప్పుడూ సంప్రదించండి, తద్వారా మీ పెంపుడు జంతువు బాగా సంరక్షించబడుతుంది. ఆహారం, సాధారణ సంరక్షణ, వెట్ సందర్శనలు మందులు. ఉపకరణాలు గురించి మరింత తెలుసుకునే అవకాశం ఉంటుంది. (Pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు