largecap stock picks | ఆనంద్ రాఠీ బ్రోకరేజ్ సంస్థ సూచిస్తున్న 6 స్టాక్స్ ఇవే..
- స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాల్లో భాగంగా ఆనంద్ రాఠీ బ్రోకరేజ్ సంస్థ లార్జ్ క్యాప్స్ స్టాక్స్‌లో నుంచి 6 ఎంపికలను సూచిస్తోంది. మార్కెట్ అస్థిరత, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో బ్రోకరేజ్ హౌస్ ఆనంద్ రాఠీ టాప్ స్టాక్స్ సూచిస్తోంది. 3 నుండి 6 నెలల కాలానికి ఈ స్టాక్స్ పరిశీలించవచ్చని బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది.
- స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ ఐడియాల్లో భాగంగా ఆనంద్ రాఠీ బ్రోకరేజ్ సంస్థ లార్జ్ క్యాప్స్ స్టాక్స్‌లో నుంచి 6 ఎంపికలను సూచిస్తోంది. మార్కెట్ అస్థిరత, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో బ్రోకరేజ్ హౌస్ ఆనంద్ రాఠీ టాప్ స్టాక్స్ సూచిస్తోంది. 3 నుండి 6 నెలల కాలానికి ఈ స్టాక్స్ పరిశీలించవచ్చని బ్రోకరేజ్ సంస్థ చెబుతోంది.
(1 / 6)
భారతీ ఎయిర్‌టెల్: ఈ టెలికాం స్టాక్‌కు బ్రోకరేజ్ సంస్థ ప్రైస్ టార్గెట్ రూ. 800గా పెట్టుకుంది. ఇది 15 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇది రూ. 570 స్టాప్ లాస్‌ను కలిగి ఉంది. రూ. 660-630 రేంజ్‌లో స్టాక్‌లోకి ప్రవేశించవచ్చని సలహా ఇస్తోంది. భౌగోళిక రాజకీయ సమస్య సమయంలో స్టాక్ మెరుగైన పనితీరును కనబరుస్తోంది. (REUTERS)
(2 / 6)
జీ: ఈస్టాక్ పై బ్రోకరేజీ సంస్థ టార్గెట్ ప్రైస్ రూ. 280గా పేర్కొంది. ఇది 15 శాతం పెరుగుదలను సూచిస్తుంది. రూ. 180 వద్ద స్టాప్ లాస్‌గా సూచించింది. రూ. 225-215 మధ్య ఎంటరవ్వొచ్చని సూచిస్తోంది. గత 2 - 3 నెలల్లో స్టాక్ గరిష్టంగా రూ. 378 నుండి దాదాపు 40 శాతం నష్టపోయింది. రూ. 170 నుండి రూ. 380 వరకు వెళ్లే ర్యాలీలో 78.6 శాతం రీట్రేస్‌మెంట్ స్థాయికి చేరుకుంటుందని బ్రోకరేజీ సంస్థ తెలిపింది.
(3 / 6)
మారుతీ సుజుకి: ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ. 8,500 గా బ్రోకరేజీ సంస్థ సూచించింది. ఇది 20 శాతం పెరుగుదలను సూచిస్తుంది. రూ. 6,000 వద్ద స్టాప్ లాస్ కలిగి ఉంది. రూ. 6,900-6,800 మధ్య ఎంటరవ్వొచ్చని సూచిస్తోంది. జనవరి 2021 నుండి స్టాక్ రూ. 9,000–6,500 మధ్య విస్తృత శ్రేణిలో ట్రేడవుతోంది.
(4 / 6)
ICICI బ్యాంక్: ఈ బ్యాంకింగ్ స్టాక్ టార్గెట్ ధర రూ. 800గా బ్రోకరేజీ సంస్థ సిఫారసు చేస్తోంది. ఇది 18 శాతం పెరుగుదలను సూచిస్తుంది. స్టాప్ లాస్ రూ. 570 అని, ఎంట్రీ రేంజ్ రూ. 655-635 అని బ్రోకరేజ్ తెలిపింది. పిచ్‌ఫోర్క్ సాధనం ప్రకారం స్టాక్ 620 మార్కుకు చేరువవుతోంది,
(5 / 6)
ఐషర్ మోటార్స్: బ్రోకరేజ్ ఈ ఆటో స్టాక్‌కు రూ. 2,800 టార్గెట్ ధరను కలిగి ఉంది, ఇది 21 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను సూచిస్తుంది. స్టాప్ లాస్ రూ.1,950 అని, ఎంట్రీ రేంజ్ రూ. 2,270-2,220 మధ్య ఉంటుందని బ్రోకరేజ్ తెలిపింది. జనవరి 2021 నుండి ఈ స్టాక్ రూ. 3,000–2,200 విస్తృత శ్రేణిలో ట్రేడవుతోంది. 3–6 నెలల కాలపరిమితితో స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫారసు చేస్తోంది.
(6 / 6)
బ్రిటానియా: ఈ FMCG స్టాక్‌కు బ్రోకరేజ్ టార్గెట్ ధర రూ. 3,900, ఇది 21 శాతం అప్‌సైడ్‌ని సూచిస్తుంది. రూ. 2,740 వద్ద స్టాప్ లాస్ అని, రూ. 3,200 -3,100 ఎంట్రీ రేంజ్ అని తెలిపింది. ఇతర FMCG స్టాక్‌లతో పాటు; బ్రిటానియా కూడా కొన్ని నెలల నుండి దిద్దుబాటు మోడ్‌లో ఉంది. అయితే, ఈ తరుణంలో స్టాక్ దాని మునుపటి డిమాండ్ జోన్ 3200 - 3100కి చేరుకుందని పేర్కొంది. ఈ విధంగా. 3–6 నెలల కాల వ్యవధితో స్టాక్‌ను కొనుగోలు చేయాలని సలహా ఇస్తుంది.
ఇతర గ్యాలరీలు