తెలుగు న్యూస్ / ఫోటో /
IRCTC Varanasi Tour : తక్కువ ధరలో వారణాసి ట్రిప్ - హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, చూసే ప్రాంతాలివే
- IRCTC Tourism Varanasi Tour: అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించుకోవాలనే వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గంగా రామాయణ్ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 27, 2023న అందుబాటులో ఉంది. ఈ వివరాలు ఇక్కడ చూడండి…..
- IRCTC Tourism Varanasi Tour: అధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించుకోవాలనే వారికి ఐఆర్‌సీటీసీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి గంగా రామాయణ్ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ సెప్టెంబర్ 27, 2023న అందుబాటులో ఉంది. ఈ వివరాలు ఇక్కడ చూడండి…..
(1 / 6)
హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో అయోధ్య, ప్రయాగ్ రాజ్, సార్ నాథ్, వారణాసితో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. ‘గంగా రామాయణ్ యాత్ర’ (Ganga Ramayan Yatra)పేరిట ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నారు(unsplash.com)
(2 / 6)
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. విమానంలో పర్యాటకుల్ని తీసుకెళ్లి ఆయా ప్రాంతాలను చూపిస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజ్… సెప్టెంబర్ 27, 2023 తేదీన అందుబాటులో ఉంది.(unsplash.com)
(3 / 6)
మొదటి రోజు హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport) నుంచి వారణాసికి చేరుకుంటారు. హోటల్‌లో భోజనం చేసి.. కాశీ దేవాలయం, రాత్రి గంగా ఘాట్ కు వెళ్తారు. రాత్రి వారణాసిలో బస చేస్తారు. రెండో రోజు కూడా వారణాసిలోనే ఉంటారు. సార్నాథ్ ను సందర్శిస్తారు. బిర్లా టెంపుల్ కు వెళ్తారు. రాత్రి కూడా వారణాసిలో ఉంటారు.(unsplash.com)
(4 / 6)
మూడో రోజు హోట్ల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ప్రయాగరాజ్ కు వెళ్తారు. అలోపిదేవీ ఆలయం, త్రివేణి సంగమంకు వెళ్తారు. సాయంత్రం అయోధ్యకు వెళ్తారు. రాత్రి అయోధ్యలోనే బస చేస్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత... అయోధ్య ఆలయానికి వెళ్తారు. రాత్రి లక్నోలో ఉంటారు.(unsplash.com)
(5 / 6)
బ్రేక్ ఫాస్ట్ తర్వాత నైమీశర్యణకు వెళ్తారు తిరికి లక్నోకు చేరుకుంటారు. అల్బహారం తర్వాత… Bara Imambara ను సందర్శిస్తారు. సాయంత్రం 4 గంటలకు లక్నో విమానాశ్రయానికి చేరుకొని తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(unsplash.com)
(6 / 6)
ఈ టూర్ ప్యాకేజీ(IRCTC Ganga Ramayan Yatra) ధర చూసుకుంటే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.34,650గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.28,600 చెల్లించాలి. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.34,650 ఉంటుంది. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్(Travel Insurance) కవర్ అవుతాయి. https://www.irctctourism.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. (unsplash.com)
ఇతర గ్యాలరీలు