(1 / 5)
హాకీ టోర్నీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు దుమ్మురేపుతోంది. తొలి మ్యాచ్‍లో చైనాను చిత్తుచేసిన టీమిండియా.. నేడు (సెప్టెంబర్ 9) జపాన్‍ను ఓడించింది. వరుసగా రెండో మ్యాచ్‍లో గెలిచింది.
(2 / 5)
భారత్ 5-1 గోల్స్ తేడాతో జపాన్‍ను నేడు మట్టికరిపించింది. మ్యాచ్ మొదటి మూడు నిమిషాల్లోనే టీమిండియా రెండో గోల్స్ కొట్టింది. భారత ప్లేయర్లు సుఖ్‍జీత్ సింగ్, అభిషేక్ గోల్స్ సాధించారు.
(3 / 5)
ఆ తర్వాత కూడా భారత్ జోరు కొనసాగింది. 17వ నిమిషంలో సంజయ్ గోల్ బాదాడు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచింది.
(4 / 5)
రెండో హాఫ్ మొదలైన కాసేపటికి జపాన్ ఓ గోల్ చేసింది. ఆ తర్వాత టీమిండియా ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. 54వ నిమిషంలో ఉత్తమ్ సింగ్, 60వ నిమిషంలో సుఖ్‍జీత్ సింగ్ తలా ఓ గోల్ సాధించారు. దీంతో 5-1 తేడాతో భారత్ ఘనంగా గెలిచింది.
(5 / 5)
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం టాప్‍లో ఉంది. రెండు విజయాలతో ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నీలో తదుపరి సెప్టెంబర్ 11న మలేషియాతో భారత్ తలపడనుంది.
ఇతర గ్యాలరీలు