AP TG Weather Updates : బలహీనపడిన ఆవర్తనం, మరిన్ని ప్రాంతాలకు 'రుతుపవనాల' విస్తరణ - తెలంగాణలో 5 రోజులపాటు వర్షాలు..!
- AP Telangana Weather Updates : ఏపీ తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. గత కొద్దిరోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
- AP Telangana Weather Updates : ఏపీ తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. గత కొద్దిరోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండీ తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి…..
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
(1 / 6)
ఏపీ తెలంగాణలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. గత కొద్దిరోజులుగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.(Photo Source Unshplash.com)
(2 / 6)
నైరుతి రుతుపవనాల వేగంగా విస్తరిస్తున్నాయి. మరోవైపు ఉపరిత ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. (Photo Source @APSDMA Twitter)
(3 / 6)
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు ఉపరిత అవర్తనం బలహీనపడినట్లు వెల్లడించింది.(Photo Source @APSDMA Twitter)
(4 / 6)
ఇవాళ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(Photo Source @APSDMA Twitter)
(5 / 6)
ఇక ఏపీలో చూస్తే ఇవాళ(జూన్ 09) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది(Photo Source Unshplash.com)
(6 / 6)
మరోవైపు ఇవాళ విజయనగరం,మన్యం,అల్లూరి, కర్నూలు,నంద్యాల,అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఉరుములతో వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు,పశు-గొర్రెల కాపరులు చెట్లు, క్రింద,బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించింది.(Photo Source @APSDMA Twitter)
ఇతర గ్యాలరీలు