తెలుగు న్యూస్ / ఫోటో /
Diabetes Tips: బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు తోడ్పడే ఆహారాలు
Blood Sugar levels: ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్‍తో బాధపడుతున్నారు. ఇది నియంత్రణలో ఉండేందుకు మందులు వాడాలి. అలాగే, కొన్ని రకాల ఆహారాలు.. శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తాయి.
(1 / 6)
డయాబెటిస్ ఉన్న వారు ఇష్టమైన అన్ని ఆహారాలను తినకూడదు. బ్లడ్ షుగర్ లెవెళ్లను దృష్టిలో పెట్టుకొని ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం రక్తంలో చక్కెర స్థాయిని కొన్ని ఆహారాలు తగ్గించగలవు. బ్లడ్ షుగర్ లెవెళ్లను కంట్రోల్ చేసేందుకు ఇవి సహజంగా ఉపయోగపడతాయి.
(2 / 6)
కాకరకాయ బ్లడ్ షుగర్ లెవెళ్లను తగ్గించగలదు. ఇది శరీరంలో ఇన్సులిన్‍ను నియంత్రించగలదు. యాంటీ ఇన్‍ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు కాకర తినడం, కాకర జ్యూస్ తాగడం చాలా మంచిది.
(3 / 6)
తులసి.. యాంటీఆక్సిడెంట్లు, అడాప్టోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి ఇన్సులిన్ ఉత్పత్తిని నియంత్రించగలవు. అందుకే రక్తంలో చక్కెర స్థాయిని తులసి కంట్రోల్ చేయగలదు.
(4 / 6)
వేపాకుల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటి ఇన్‍ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తం శుభ్రంగా అయ్యేందుకు, బ్లడ్ షుగల్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు తోడ్పడతాయి.
(5 / 6)
కలబంద రసం తాగడం వల్ల ప్యాంక్రియాటిక్ పనితీరు మెరుగవుతుంది. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది.
ఇతర గ్యాలరీలు