తెలుగు న్యూస్ / ఫోటో /
Excess water intake : నీరు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువ తాగితే ప్రాణాంతకమట
- Excess water intake : నీరు శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నీరు ఎక్కువగా తాగడం వల్ల పెద్ద రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరం బాగుంటుందని భావించి ఎక్కువ నీరు తాగుతున్నారా? ప్రమాదం ఎంత పెద్దదో తెలుసుకోవడం మంచిది
- Excess water intake : నీరు శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నీరు ఎక్కువగా తాగడం వల్ల పెద్ద రోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ శరీరం బాగుంటుందని భావించి ఎక్కువ నీరు తాగుతున్నారా? ప్రమాదం ఎంత పెద్దదో తెలుసుకోవడం మంచిది
(1 / 8)
నీరు శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దీని లోపం తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి చలికాలంలో కూడా ప్రతిరోజూ కొంత మొత్తంలో నీరు తాగాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇది వివిధ అవయవాల పనితీరును ఉంచుతుంది. అలా అని ఎక్కువ నీరు తీసుకుంటే.. కూడా మంచిది కాదు అంటున్నారు నిపుణులు.(Freepik)
(2 / 8)
అతిగా ఏది తీసుకున్నా.. అది శరీరానికి అంత మంచిది కాదు. నీటికి కూడా ఇదే వర్తిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మరణం కూడా సంభవించవచ్చు.(Freepik)
(3 / 8)
మీరు విన్నది మీరు నమ్మకపోవచ్చు. అయితే ప్రపంచ ప్రఖ్యాత నటుడు బ్రూస్ లీ మరణం కూడా ఈ కారణంగానే జరిగింది. బ్రూస్ లీ అదనపు నీరు, నీటి ఆహారాన్ని తీసుకునే ధోరణితో ఉండేవారు. సాధారణంగా మూత్రపిండాలు మూత్రం ద్వారా అదనపు నీటిని ఫిల్టర్ చేస్తాయి. కానీ కిడ్నీ సమస్య కారణంగా నీళ్లు వదిలే అవకాశం రాలేదు. తద్వార పరిస్థితి చేజారిపోయింది.(Freepik)
(4 / 8)
మెదడులో అదనపు నీరు పేరుకుపోవడం వల్ల.. మెదడు వాపు సంభవిస్తుందని నిపుణులు చెప్తున్నారు.(Freepik)
(5 / 8)
అనేక అధ్యయనాల ప్రకారం.. ఎక్కువ నీరు తాగడం రక్తపోటును పెంచుతుంది. అలాగే మెదడు కణాల వాపు ప్రవర్తనలో అసాధారణ మార్పులకు కారణమవుతుంది.(Freepik)
(6 / 8)
అలాగే అదనపు నీరు అసాధారణ హృదయ స్పందనకు కారణమవుతుంది. రక్తపోటు పెరిగేకొద్దీ.. ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణం. ఇది గుండె కొట్టుకోవడం, గుండెపోటుకు దారితీస్తుంది.(Freepik)
ఇతర గ్యాలరీలు