(1 / 7)
యాదాద్రి భువనగిరి జిల్లా సంగెం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునర్జీవ సంకల్పయాత్ర చేపట్టారు. శుక్రవారం ఉదయం యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఆ తర్వాత సంగెం గ్రామానికి చేరుకున్నారు.
(2 / 7)
సంగెంలోని మూసీనది ఒడ్డున ఉన్న శివలింగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(3 / 7)
సంగెం లోలెవల్ బ్రిడ్జి నుంచి ధర్మారెడ్డిపల్లి కాలువ మీదగా సీఎం రేవంత్ రెడ్డి 2.5 కి.మీ మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా బోటు ద్వారా మూసిలోకి దిగిన ఆయన… పరివాహన ప్రాంతాలు పరిశీలించారు.
(4 / 7)
ఆ తర్వాత కాలినడకన మూసీ పునరుజ్జీవ సభాస్థలికి చేరుకున్నారు. సంగెం గ్రామస్థులు మూసీ వల్ల కలిగే సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరూ అడ్డుపడిన మూసీ ప్రక్షాళన ఆగదని స్పష్టం చేశారు.
(5 / 7)
ముఖ్యమంత్రి రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ శ్రేణలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జెండాలు, ఫ్లైక్సీలు భారీగా దర్శనమిచ్చాయి.
(6 / 7)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ యాత్ర సందర్భంగా… స్థానిక గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు.
(7 / 7)
2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలుపెడతాని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దమ్ముంటే కేటీఆర్, హరీశ్ రావ్ రావాలని సవాల్ విసిరారు. "మిమ్మల్ని ఇక్కడి ప్రజలు రానిస్తారో.. నడుముకు తాడుకట్టి మూసీలో ముంచేస్తారో చూద్దాం” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఇతర గ్యాలరీలు